Good News For Taxpayers: పన్ను చెల్లింపుదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుందా.. కొత్త బడ్జెట్‌లో ప్రకటించే ఛాన్స్..

Good News For Taxpayers: కేంద్రప్రభుత్వం 2023-24 సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు శుభవార్త ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80C కింద ప్రభుత్వం లక్షా 50 వేల రూపాయల వరకు ఉన్న పరిమితిని పెంచే అవకాశం..

Good News For Taxpayers: పన్ను చెల్లింపుదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుందా.. కొత్త బడ్జెట్‌లో ప్రకటించే ఛాన్స్..
Tax Deduction Expectations In Upcoming Inion Budget 2023 24
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 23, 2022 | 1:56 PM

Good News For Taxpayers: కేంద్రప్రభుత్వం 2023-24 సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు శుభవార్త ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80C కింద ప్రభుత్వం లక్షా 50 వేల రూపాయల వరకు ఉన్న పరిమితిని పెంచే అవకాశం ఉందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. ఈ నేపథ్యంలో 80C పరిమితి ఎందుకు పెరగనుందో వివరించింది. బడ్జెట్‌కు ముందు కొన్ని అంశాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. వీటిలో ప్రధానమైనది 80సీ, ఆదాయపు పన్ను చట్టంలో ఉన్న మినహాయింపుల్లో సెక్షన్ 80సీ సర్వసాధారణం. పన్ను ఆదా కోసం దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని ద్వారా ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో లక్షా 50 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఆ పెట్టుబడిపై పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం వ్యక్తి మొత్తం ఆదాయం నుంచి తీసివేస్తారు… దీని కారణంగా పన్ను చెల్లించాల్సిన ఆదాయం తగ్గుతుంది. అదే సమయంలో పెట్టుబడిపై రాబడి పొందుతారు.

80C కింద పెట్టుబడుల గురించి తెలుసుకుంటే 80C ప్రయోజనాన్ని పొందడానికి, పన్ను చెల్లింపుదారులు కొన్ని రకాల పథకాలను పెట్టుబడి పెట్టేందుకు ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. వీటిలో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఉన్నాయి. అలాగే ELSS ఫండ్స్, మ్యూచువల్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన, ఐదేళ్ల పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ (ఎన్‌ఎస్‌సి), సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, ఇన్సూరెన్స్ ప్రీమియం, హోమ్ లోన్ అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించడం వంటి వాటిని ఎంచుకోవచ్చు. పిల్లల ఎడ్యుకేషన్‌కు సంబంధించిన ట్యూషన్ ఫీజు ఖర్చులకు 80Cకింద పన్ను మినహాయింపు పొందవచ్చు.

80C యొక్క పరిమితి లక్షా 50 వేల రూపాయలుగా ఉంది. 2013-14 ఆర్థిక సంవత్సరం వరకు, ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్-80C ప్రకారం, సంవత్సరానికి గరిష్టంగా లక్ష రూపాయల తగ్గింపు అందుబాటులో ఉండేది… 2014 ఆర్థిక సంవత్సరం ఈ పరిమితిని లక్షా 50వేల రూపాయలకు పెంచారు. అప్పటి నుంచి దాదాపు 8 ఏళ్లుగా ఈ పరిమితిలో ఎటువంటి మార్పులేదు. 80సీ తగ్గింపు పరిమితిని పెంచాలనే డిమాండ్ ఎంతో కాలంగా ఉంది… 2023-24 వార్షి బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి కొద్ది నెలల ముందు ఈ డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. అసలు 80సీ పరిమితి పెంచాలనే డిమాండ్ ఎందుకు వినిపిస్తోంది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) తన ప్రీ-బడ్జెట్ మెమోరాండం 2023లో బడ్జెట్‌లో 80C కింద మినహాయింపు పరిమితిని లక్షా 50 వేల నుంచి రెండు లక్షల 50 వేల రూపాయలకు పెంచాలని సూచించింది. దీని ద్వారా సామాన్య ప్రజల పొదుపు పెరుగుతుందని అభిప్రాయపడింది.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ ఉద్యోగులతోపాటు సామాన్యులకు సెక్షన్ 80సీ ద్వారా పన్ను మినహాయింపుతో ఎంతో ప్రయోజనం లభిస్తుందని, అయితే ఈమినహాయింపులు తొలగించి.. ప్రజలందరిని కొత్త పన్ను విధానంలోకి తీసుకురావాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్లు చార్టర్డ్ అకౌంటెంట్ వినోద్ రావల్ తెలిపారు. బహుశా 80C పరిమితిని కొన్నేళ్లుగా పెంచడం లేదు కాబట్టి… ప్రభుత్వం కొత్త పన్నుతో పాత పన్ను విధానాన్ని కొనసాగిస్తే, 80C పరిమితిని రెండు లక్షల 50వేల రూపాయలకు పెంచాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు వినోద్ రావల్ 80C కింద పెట్టుబడులు పెట్టడం ఓల్డ్ ఆప్షన్ అని, అయితే ఇటీవల కాలంలో అనేక కొత్త పెట్టుబడి పథకాలు వచ్చాయని, ద్రవ్యోల్బణం హెచ్చరికల దృష్ట్యా, 80C పన్ను మినహాయింపు పథకంలో కత్త పెట్టుబడి పథకాలను ఎంచుకోవడం మంచిదని రావల్ తెలిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..