Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి పథకంతో మీ అమ్మాయి బంగారు భవిష్యత్ కు బాటలు వివరాలు చెక్ చేసుకోండి

మధ్య తరగతి కుటుంబాలకు చాలా సుపరిచితమైన ఈ పథకాన్ని 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో డిపాజిట్ చేసిన సొమ్ముకు అధిక వడ్డీ చెల్లించడమే కాకుండా, ఆదాయపు పన్ను మినహాయింపులను కూడా అందిస్తుంది. సో అధిక ప్రయోజలుండే ఈ పథకం బెన్ ఫిట్స్ ఏంటో తెలుసుకుందాం.

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి పథకంతో మీ అమ్మాయి బంగారు భవిష్యత్ కు బాటలు వివరాలు చెక్ చేసుకోండి
Sukanya Samriddhi Yojana
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Dec 23, 2022 | 4:52 PM

బాలికల విద్యను ప్రోత్సహించడానికి, బాలికల బాల్య వివాహాలను నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుతమైన పథకం సుకన్య సమృద్ధి యోజన అకౌంట్. మధ్య తరగతి కుటుంబాలకు చాలా సుపరిచితమైన ఈ పథకాన్ని 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో డిపాజిట్ చేసిన సొమ్ముకు అధిక వడ్డీ చెల్లించడమే కాకుండా, ఆదాయపు పన్ను మినహాయింపులను కూడా అందిస్తుంది. సో అధిక ప్రయోజలుండే ఈ పథకం బెన్ ఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. నిబంధనల ప్రకారం ఈ పథకం కింద సొమ్మును నిల్వ చేయాలంటే కచ్చితంగా 10 ఏళ్ల లోపు ఆడపిల్ల తల్లిదండ్రులు మాత్రమే అర్హులు. బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ఎక్కడైన ఓ చోట మాత్రమే సుకన్య సమృద్ధి ఖాతాను  తెరవాలి. కుటుంబంలో ఇద్దరు కంటే ఎక్కువ మంది ఆడపిల్లలుంటే ఇద్దరికి మాత్రమే ఖాతను తెరిచే అవకాశం ఉంది. 

వడ్డీ రేటు, పెట్టుబడి

ఈ పథకం కింద సంవత్సరానికి 7.6 శాతం వడ్డీ వస్తుంది. సంవత్సరానికి రూ.250 కనీస బ్యాలెన్స్ తో ఎకౌంట్ ను నిర్వహించకోవచ్చు. ఏడాదికి రూ.1.50 లక్షల వరకూ డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ రూ.250 తో ఖాతాను నిర్వహించలేకపోతే రూ.50 తో మళ్లీ ఖాతాను పునరుద్ధరించుకోవచ్చు. అంటే రూ.300తో ఖాతా పునురుద్ధరణ అందుబాటులో ఉంటుంది. కానీ ఖాతా తెరిచిన నాటి నుంచి 15 ఏళ్ల లోపు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. ఖాతా తెరచిన నాటి నుంచి 15 ఏళ్ల వరకూ సొమ్మును దాచుకోవచ్చు. 

ఖాతా ముగింపు, మెచ్యూరిటీ

ఖాతాను ముందే ముగించడానికి ఖాతా తెరచిన నాటి నుంచి 5 ఏళ్ల గడువు ఉండాలి. అయితే ఇది కేవలం ఖాతాదారుని మరణం, ప్రాణాంతక వ్యాధి, సంరక్షకుని మరణం నేపథ్యంలో ఈ సేవ అందుబాటులో ఉంటుంది. అలాగే ఖాతా మెచ్యూరిటీ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఖాతా తెరిచిన నాటి నుంచి 21 సంవత్సరాలు పూర్తయ్యాక మెచ్యూరిటీ అవుతుంది. లేదా ఖాతాదారుని వయస్సు 18 ఏళ్లు పూర్తయ్యాక పెళ్లి సమయంలో కూడా ఖాతా మెచ్యూర్ అవుతుంది. ఈ సమయంలో వడ్డీ కోల్పోతామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఖాతా తెరిచే విధానం

ఈ ఖాతా దేశంలోని ప్రతి పోస్టాఫీస్ లో, అలాగే అన్ని జాతీయ బ్యాంకుల్లో అందుబాటులో ఉంటుంది. సంబంధిత శాఖ వద్దకు వెళ్లి వాళ్లకి విషయం తెలిపి సంబధిత ఫామ్స్ నింపాలి. అనంతరం ప్రూఫ్స్ సబ్మిట్ చేసి ఖాతా తెరివవచ్చు. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం..మీకు పదేళ్ల లోపు అమ్మాయి ఉంటే వెంటనే వెళ్లి సుకన్య సమృద్ధి ఖాతాను తెరవండి. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి