Redmi Note 12 Pro: 200 మెగా పిక్సల్స్ కెమెరాతో రెడ్ మీ నోట్ 12 ప్రో..జనవరి 5న మార్కెట్లోకి..

రెడ్ మీ సిరీస్ లో భాగం 12 నోట్ ప్రో సిరీస్ తో మన ముందుకు రానుంది. 12 ప్రో, 12 ప్రో ప్లస్ రెండు వేరియంట్లలో ఫోన్ అందుబాటు ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో 200 మెగా పిక్సెల్ కెమెరాతో ఈ మోడల్ ను అక్టోబర్ 28న కంపెనీ చైనాలో ప్రవేశపెట్టింది.

Redmi Note 12 Pro: 200 మెగా పిక్సల్స్ కెమెరాతో రెడ్ మీ నోట్ 12 ప్రో..జనవరి 5న మార్కెట్లోకి..
Redmi note 12 pro
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Dec 20, 2022 | 3:41 PM

ప్రస్తుతం అంతా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ మార్కెట్  కు భారత్ లో  అధిక డిమాండ్ ఉం ది. అయితే ఈ డిమాండ్ నేపథ్యంలో పెద్ద పెద్ద కంపెనీలు సైతం భారత్ లో తమ వ్యాపారాన్ని విస్తరించాయి. భారత్ లో అత్యంత ప్రజాదరణ కలిగిన ఎంఐ.  తాజా ఎంఐ సబ్ బ్రాండ్ రెడ్ మీ నూతన ఫోన్ ను లాంచ్ చేసింది. రెడ్ మీ నోట్ సిరీస్ లో భాగంగా నోట్ 12 ప్రోతో మన ముందుకు రానుంది. 12 ప్రో, 12 ప్రో ప్లస్ రెండు వేరియంట్లలో ఫోన్ అందుబాటు ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో 200 మెగా పిక్సెల్ కెమెరాతో ఈ మోడల్ ను అక్టోబర్ 28న కంపెనీ చైనాలో ప్రవేశపెట్టింది. అయితే ఈ ఫోన్ ను ప్రస్తుతం జనవరి 5న భారత్ మార్కెట్ లోకి తీసుకురానుంది. అయితే దీని ధర భారత్ లో ఎంత ఉంటుంది అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. 

రెడ్ మీ నోట్ 12 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్స్

  • 200 ఎంపీ బ్యాక్ కెమెరా
  • 2400×1080 పిక్సెళ్ల రెజ్యుల్యూషన్ తో 120Hz రిఫ్రెష్ రేట్ తో 6.67 అంగుళాల డిస్ ప్లే
  • అందుబాటులో డాల్బి టెక్ విజన్ 
  • మీడియా టెక్ డైమెన్సటీ ప్రాసెసర్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 200 W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 

రెడ్ మీ 12 ప్రో స్పెసిఫికేషన్స్

  • 50 ఎంపీ బ్యాక్ కెమెరా, 8 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో కెమెరా
  • 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా
  • మిగిలిన స్పెసిఫికేషన్లన్నీ 12 ప్రో ప్లస్ మాదిరిగానే ఉన్నాయి.

అయితే ఇది భారతీయ మార్కెట్ 6 జీబీ ర్యామ్ +128 జీబీ మోడల్ రూ.20,000 కంటే తక్కువుగా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే 12 ప్రో ప్లస్ ధర మాత్రం రూ.30,000 ఉంటుందని పేర్కొంటున్నాయి. అయితే లాంచ్ ఈవెంట్లో దీని అసలైన ధరను కంపెనీ ప్రకటించనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి