Google New Feature: గూగుల్ లెన్స్ లో సరికొత్త ఫీచర్..డాక్టర్ ప్రిస్కిప్షన్ అర్థమయ్యేలా..!

మనం ఎంత ఎడ్యుకేడెట్ అయినా మనకు ఆ ప్రిస్కిప్షన్ అర్థం కాదు. కేవలం మెడికల్ షాప్ వాళ్లకు మాత్రమే అది అర్థమవుతుంది. అసలు మనకి డాక్టర్ ఏం మందు రాసిచ్చాడో తెలుసుకోవాలన్నా మెడికల్ షాప్ కు వెళ్లాల్సిందే. అయితే ఈ సమస్యకు గూగుల్ చక్కటి పరిష్కార మార్గంతో ముందుకొస్తుంది. గూగుల్ లెన్స్ ద్వారా డాక్టర్ ప్రిస్క్ ప్షన్ మనకు అర్థమయ్యేలా చేస్తామని ప్రకటించింది.

Google New Feature: గూగుల్ లెన్స్ లో సరికొత్త ఫీచర్..డాక్టర్ ప్రిస్కిప్షన్ అర్థమయ్యేలా..!
Google
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 20, 2022 | 3:36 PM

మామూలుగా మనం అనారోగ్యానికి గురైతే చికిత్స కోసం డాక్టర్ ను సంప్రదిస్తాం. ఆయన కొన్ని మందులను సూచిస్తూ ప్రిస్కిప్షన్ రాసి ఇస్తాడు. అయితే మనం ఎంత ఎడ్యుకేడెట్ అయినా మనకు ఆ ప్రిస్కిప్షన్ అర్థం కాదు. కేవలం మెడికల్ షాప్ వాళ్లకు మాత్రమే అది అర్థమవుతుంది. అసలు మనకి డాక్టర్ ఏం మందు రాసిచ్చాడో తెలుసుకోవాలన్నా మెడికల్ షాప్ కు వెళ్లాల్సిందే. అయితే ఈ సమస్యకు గూగుల్ చక్కటి పరిష్కార మార్గంతో ముందుకొస్తుంది. గూగుల్ లెన్స్ ద్వారా డాక్టర్ ప్రిస్క్ ప్షన్ మనకు అర్థమయ్యేలా చేస్తామని ప్రకటించింది.

ఇటీవల నిర్వహించిన గూగుల్ కంపెనీ మీటింగ్ లో ఈ సరికొత్త ఫీచర్ గురించి తెలిపింది. డాక్టర్ ప్రిస్కిప్షన్ ను ఫొటో లైబ్రరీ ద్వారా అప్ లోడ్ చేస్తే గూగుల్ లెన్స్ సాయంతో మెడిసన్ పేరేంటో తెలిసేలా చేస్తామని పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ సాయంతో ఈ ఫీచర్ ను డెవలప్ చేస్తున్నట్లు వివరించింది. అయితే ఈ ఫీచర్ ను ఎప్పటిలోగా ప్రవేశ పెడతామనే విషయాన్ని మాత్రం కచ్చితంగా పేర్కొనలేదు. ప్రస్తుతం ఈ అంశంపై పని చేస్తున్నామని మాత్రమే తెలిపింది. మరింత కచ్చితత్వంతో ఈ ఫీచర్ పని చేసేలా చేయడానికి ఫార్మాసిస్టులతో కలిపి పని చేస్తున్నామని వివరించింది. రాబోయే రోజుల్లో ఈ ఫీచర్ వినియోగదారులకు అందించే అవకాశం ఉంది. వినియోగదారులు ఇటీవల కాలంలో గూగుల్ లెన్స్ ను అధికంగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ మరిన్ని ఏఐ సాధనాలను అందిస్తుందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. 

అలాగే గూగుల్ పే లో ఏదైనా మోసపూరిత కార్యకలాపాన్ని గుర్తిస్తే ప్రజలను అప్రమత్తం చేసేలా మల్టీ లేయర్డ్ ఇంటెలిజెన్స్ వార్నింగ్ సిస్టమ్ ను ప్రవేశపెట్టింది. అలాగే నేషనల్ ఈ గవర్నెన్స్ ఒప్పందం చేసుకోవడం ద్వారా డిజిటల్ డాక్యుమెంట్స్ ఫైల్స్ బై గూగుల్ ద్వారా పొందచ్చని తెలిపింది. అలాగే మొబైల్ లో ఉన్న ఫొటోస్ ను సెర్చ్ ఇంజిన్ లో కూడా భారతీయ భాషలను ప్రవేశపెట్టడానికి కృషి చేస్తున్నట్లు వివరించింది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ