Google New Feature: గూగుల్‌ చాట్‌లో సరికొత్త ఫీచర్.. మెసేజ్ చదివారా? లేదా? అడుగుతూనే ఉంటుంది..!

Google New Feature: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ చాట్ కోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. యూజర్ల సౌకర్యాన్ని, అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ..

Google New Feature: గూగుల్‌ చాట్‌లో సరికొత్త ఫీచర్.. మెసేజ్ చదివారా? లేదా? అడుగుతూనే ఉంటుంది..!
Google Chat
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 24, 2021 | 6:05 AM

Google New Feature: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ చాట్ కోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. యూజర్ల సౌకర్యాన్ని, అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ.. కొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకువచ్చే గూగుల్.. ఇప్పుడు మరో అట్రాక్టీవ్ ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఈ ఫీచర్‌తో ‘గూగుల్ చాట్‌’కు అదనపు హంగులు అద్దే ప్రయత్నం చేస్తోంది. గూగుల్ చాట్‌లో వచ్చిన మెసేజ్‌ లను చదివారా? లేదా? అనేది తెలుసుకునేందుకు గానూ కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. డెస్క్, మొబైల్‌లో మెసేజ్ చదివారా? లేదా? అని తెలుసుకునేందుకు ‘రిమైండ్’ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా మేసేజ్ చదివారా లేదా అన్నది తెలుసుకోవచ్చు. ఒకవేళ చదవకుంటే.. రిమైండ్ చేసే అవకాశం ఈ ఫీచర్ ద్వారా లభిస్తుంది. ఈ ఫీచర్‌ను వినియోగించేందుకు పాపప్ మెనూ ఆస్క్ నుంచి ‘మార్క్‌ యాజ్‌ అన్‌రెడ్‌’ బటన్‌ను సెలెక్ట్‌ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకున్న తరువాత గూగుల్ చాట్ ఓపెన్ చేస్తే.. చదవని మెసేజ్‌లే మొదటగా కనిపిస్తాయి. దీని ద్వారా వినియోగదారులు మిస్ అయిన మెసేజ్‌లను చదవడాకి ఆస్కారం లభిస్తుంది. అయితే, ఈ ఫీచర్‌ను గూగుల్ నవంబర్ నెలలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలో ఉందని గూగుల్ ప్రతినిధులు చెబుతున్నారు.

Also read:

CPR Treatment: ఇలా చేసి నిండు ప్రాణాలను కాపాడొచ్చు.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశం ఇది..!

App Reduce BP: యాప్‌తో తగ్గుతున్న బీపీ.. మూడేళ్ల అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి..

Migraine Relief Tips: మైగ్రేన్‌‌తో ఇబ్బంది పడుతున్నారా?.. అయితే ఇలా ఉపశమనం పొందండి..