Migraine Relief Tips: మైగ్రేన్‌తో ఇబ్బంది పడుతున్నారా?.. అయితే ఇలా ఉపశమనం పొందండి..
Migraine Relief Tips: మైగ్రేన్.. నరకానికి కేరాఫ్ అని చెప్పాలి. ఎంతోమంది ఈ మైగ్రేన్‌తో సతమతవుతుంటారు. తీవ్రమైన తలపోటు కారణంగా దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటుంటారు.
Migraine Relief Tips: మైగ్రేన్.. నరకానికి కేరాఫ్ అని చెప్పాలి. ఎంతోమంది ఈ మైగ్రేన్‌తో సతమతవుతుంటారు. తీవ్రమైన తలపోటు కారణంగా దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా మెట్రో నగరాల్లోని ప్రజలు ఈ సమస్యను ఎదుర్కొంటుంటారు. కాలుష్యం, ఒత్తిడి, డిప్రెషన్ వంటి వాటివల్ల.. మెగ్రేన్ సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నాయి. ఇంట్లో ఎక్కవ సమయం పని చేయడం, కంప్యూటర్ స్క్రీన్‌ను గంటల తరబడి తెరిపారా చూడటం, స్మార్ట్ ఫోన్ అతిగా వాడటం, నిద్రలేమి, సమయపాలన లేని తిండి వల్ల కూడా మైగ్రేన్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. అయితే, మైగ్రేన్‌ను తక్కువగా చూడొద్దని వైద్యులు సూచిస్తున్నారు. మైగ్రేన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
మరి మెగ్రేన్ ఎలా రిలీఫ్ పొందాలంటే.. అసంబద్ధమైన జీవన శైలిని మార్చుకోవడం ద్వారానే మైగ్రేన్‌ను జయించవచ్చునని వైద్యులు చెబుతున్నారు. చక్కటి జీవన విధానాన్ని అలవరుచుకుని మైగ్రేన్‌ను తరిమికొట్టొచ్చు. అల్కాహాల్, స్మోకింగ్ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. మంచి ఆహారం, కంటి నిండా నిద్ర, వ్యాయాయం ద్వారా మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు. అధికంగా స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని తగ్గించుకోవాలని కూడా సూచిస్తున్నారు.
Also read: