Weight Loss Tips: కొవ్వును కొవ్వుతోనే కరిగించాలి.. అదెలాగో ఇక్కడ తెలుసుకోండి.. ఆసక్తికర విశేషాలు మీకోసం..

Weight Loss Tips: ముల్లును ముల్లుతోనే తీయాలి.. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలనే తెలుగు నానుడులు మనకు తెలిసిందే. అదే విధంగా బరువు తగ్గాలనుకునే వారు కూడా కొవ్వును కొవ్వుతోనే..

Weight Loss Tips: కొవ్వును కొవ్వుతోనే కరిగించాలి.. అదెలాగో ఇక్కడ తెలుసుకోండి.. ఆసక్తికర విశేషాలు మీకోసం..
Weight Loss Tips
Follow us

|

Updated on: Oct 24, 2021 | 3:53 AM

Weight Loss Tips: ముల్లును ముల్లుతోనే తీయాలి.. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలనే తెలుగు నానుడులు మనకు తెలిసిందే. అదే విధంగా బరువు తగ్గాలనుకునే వారు కూడా కొవ్వును కొవ్వుతోనే కరిగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదేంటి కొవ్వును కొవ్వుతో ఎలా కరిగిస్తారబ్బా అని డీప్‌గా ఆలోచిస్తున్నారా?. అయితే కాస్త ఆగండి ఆ విషయంలో ఇప్పుడు వెళదాం. కొవ్వుల్లో మంచి కొవ్వులు, చెడు కొవ్వులు అని రకాలు ఉంటాయి. సో.. శరీరంలో చెడు కొవ్వు తగ్గాలంటే.. శరీరంలోకి మంచి కొవ్వును ఎక్కించాలి. అవును.. బరువు తగ్గాలంటే మనం తినే ఆహారంలో ఎంతో కొంత కొవ్వు ఉండి తీరాలి. అయితే మంచి కొవ్వు అయ్యి ఉండాలి. అంటే.. ఆలిన్ నూనె, వెన్న, నెయ్యి ఈ మంచి కొవ్వుకు కేంద్రాలు అని చెబుతున్నారు. ఈ మూడూ శరీర బరువును తగ్గించేందుకు ఉపకరిస్తాయంటున్నారు. వీటిలో ఉండే పోషకాలు, క్యాలరీలు మనిషి సునాయాసంగా బరువు తగ్గేందుకు ఉపకరిస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఈ మూడు పదార్థాల వలన ప్రయోజనం ఏంటి..? వాటిలోని తేడాలు ఏంటి..? ఇప్పుడు తెలుసుకుందాం..

ఆలివ్‌ ఆయిల్: బరువు తగ్గడానికి ఉపకరించడంలో దీనికి మించింది లేదని డైట్ నిపుణులు చెబుతుంటారు. మెడిటరేనియన్ డైట్‌లో ఆలివ్ ఆయిల్ ప్రధాన పాత్రో పోషిస్తుంది. దీనిలో మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి ఆకలిని తీర్చి.. అధిక బరువును తగ్గించే గుణాలు కలిగి ఉంటాయి. ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్‌లో 119 క్యాలరీలు, 13.5 గ్రాముల కొవ్వులు ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా ట్రేస్‌ కెమికల్స్‌ ఉంటాయి. ఎక్స్‌ట్రా వర్జిన్‌ ఆలివ్‌ ఆయిల్‌లో మిగతా ఆలివ్‌ నూనెల్లో లేనన్ని యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

వెన్న: కీటో డైట్‌లో నూనెకు ప్రత్యామ్నాయంగా వెన్నను ఉపయోగిస్తుంటారు. అయితే దీనిని సైతం పరిమితంగా తీసుకోవాలి. స్వచ్చమైన పాల నుంచి తయారు చేసిన వెన్నలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండవని, పై విటమిన్‌ ఎ, ఇ, యాంటీఆక్సిడెంట్స్‌, క్యాల్షియం మొదలైన పోషకాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. అత్యధిక కొవ్వు కలిగిన ఈ వెన్న తినడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు రావని చెబుతున్నారు నిపుణులు. వెన్న తీసుకోవడం ద్వారా కడుపు నిండినట్లుగా అనిపించి.. తక్కువగా తింటారని, తద్వారా బరువును సునాయసంగా తగ్గించుకోవచ్చునని చెబుతున్నారు.

నెయ్యి: అమ్మో నెయ్యా అని అందరూ బయపడుతుంటారు. కానీ, ఈ నెయ్యి కూడా బరువు తగ్గేందుకు ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నెయ్యిలో విటమిన్‌ ఎ, డి, కె మొదలైన ఫ్యాట్‌ సాల్యుబుల్‌ విటమిన్లు ఉంటాయి. నెయ్యిలోని ఎంజైమ్స్‌ పేగులకు చేటు చేయవు. తేలికగా అరుగుతుంది. ఒక టీస్పూను నెయ్యిలో 115 క్యాలరీలు, 9.3 గ్రాముల శాచురేటెడ్‌ ఫ్యాట్‌, 38.4 గ్రాముల కొలెస్ట్రాల్‌, 0 పిండిపదార్థాలు ఉంటాయి.

Also read:

Ind vs Pak T20 Match: నేడు భారత్-పాక్ మధ్య టీ20 మ్యాచ్.. ఫుల్ స్వింగ్‌లో బెట్టింగ్ రాయుళ్లు.. ఏకంగా ఇతర రాష్ట్రాల ఐపీతో..

Visakhapatnam: భారతీయ యుద్ధ నౌకలో అగ్ని ప్రమాదం.. నలుగురు సైనికులకు తీవ్ర గాయాలు..

Sugar: చక్కెరతో ఫేస్‌ క్లీన్.. ఇలా చేయండి మెరిసే అందం మీ సొంతం