Visakhapatnam: భారతీయ యుద్ధ నౌకలో అగ్ని ప్రమాదం.. నలుగురు సైనికులకు తీవ్ర గాయాలు..

Visakhapatnam: భారత నౌకాదళానికి చెందిన యుద్ధ నౌక రణ్ విజయ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సముద్రంలో బెర్త్ చేసిన నౌకలో అగ్నీ కీలలు ఎగసిపడ్డాయి.

Visakhapatnam: భారతీయ యుద్ధ నౌకలో అగ్ని ప్రమాదం.. నలుగురు సైనికులకు తీవ్ర గాయాలు..
Warship
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 24, 2021 | 3:01 AM

Visakhapatnam: భారత నౌకాదళానికి చెందిన యుద్ధ నౌక రణ్ విజయ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సముద్రంలో బెర్త్ చేసిన నౌకలో అగ్నీ కీలలు ఎగసిపడ్డాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగింది. నౌకలు చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా, యుద్ధ నౌకలో ఉన్న నలుగురు సైనికులు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ సైనికులను నావికాదళ ఆస్పత్రి కళ్యాణిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఇటీవలే సముద్రంలో నిర్వహించిన పలు ఆపరేషన్‌లలో పాల్గొన్న యుద్ధ నౌక రణ్ విజయ్.. తిరిగి వచ్చింది. విశాఖ నావికాదళ నౌకాశ్రయంలో బెర్త్ చేయబడిన సమయంలో అగ్ని ప్రమాదానికి గల కారణాలను పరిశోధనకు విచారణ కమిటీని నియమించినట్లు తూర్పు నావికాదళం అధికారులు ప్రకటించారు. అలాగే గాయపడిన సైనికులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.

Also read:

Sugar: చక్కెరతో ఫేస్‌ క్లీన్.. ఇలా చేయండి మెరిసే అందం మీ సొంతం

గుడ్‌న్యూస్‌.. ఇకపై ఇతరుల టికెట్‌పై ప్రయాణించొచ్చు.. వీడియో

కామెడీ చేద్దామనుకున్నాడు.. కటకటాలపాలయ్యాడు.. వీడియో