AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sugar: చక్కెరతో ఫేస్‌ క్లీన్.. ఇలా చేయండి మెరిసే అందం మీ సొంతం

Sugar: ప్రతి ఒక్కరూ మెరిసే అందమైన చర్మం కావాలని కోరుకుంటారు. కానీ మంచి చర్మం కోసం రకరకాల బ్యూటీ ప్రొడాక్ట్స్‌ వాడాలి. మీరు ఇంట్లో తయారుచేసిన

Sugar: చక్కెరతో ఫేస్‌ క్లీన్.. ఇలా చేయండి మెరిసే అందం మీ సొంతం
Suger
uppula Raju
|

Updated on: Oct 23, 2021 | 10:45 PM

Share

Sugar: ప్రతి ఒక్కరూ మెరిసే అందమైన చర్మం కావాలని కోరుకుంటారు. కానీ మంచి చర్మం కోసం రకరకాల బ్యూటీ ప్రొడాక్ట్స్‌ వాడాలి. మీరు ఇంట్లో తయారుచేసిన కొన్ని వస్తువులతో కోల్పోయిన మెరుపును తిరిగి పొందవచ్చు. అటువంటి దానిలో చక్కెర చాలా ముఖ్యమైనది. ఇది మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. ఇంతకు ముందు మీరు ఎప్పుడు చర్మంపై చక్కెరను ఉపయోగించకపోవచ్చు కానీ ఇది నిజం. చక్కెరను ఏ విధంగా అప్లైచేయాలో తెలుసుకుందాం.

1. ఒక చెంచా పంచదార, పెరుగు తీసుకొని రెండింటినీ కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని మీ ముఖానికి అప్లై చేసి నెమ్మదిగా ముఖాన్ని మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మూసుకుపోయిన రంధ్రాలలో దాగిన చెడు బయటకు వస్తుంది. మీ ముఖంపై గ్లో వస్తుంది. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

2. నిమ్మకాయ ఎల్లప్పుడూ చర్మానికి ఉపయోగపడుతుంది. నిమ్మరసాన్ని చక్కెరతో కలిపి ముఖానికి అప్లై చేయవచ్చు. ఇలా చేస్తే ముఖంపై ఉన్న మురికి తొలగిపోతుంది. అర టీస్పూన్ నిమ్మరసాన్ని ఒక టీస్పూన్ పెరుగులో కలపండి. తేలికపాటి చేతులతో ఈ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేసి మెత్తగా మసాజ్ చేయండి. 10 నిమిషాల పాటు అప్లై చేసిన తర్వాత ముఖాన్ని శుభ్రమైన నీటితో కడగాలి.

3. షుగర్ స్క్రబ్‌తో ముఖానికి మసాజ్ చేయడం వల్ల చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. పంచదారలో అర టీస్పూన్ నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ వేసి మిక్స్ చేసి అప్లై చేయాలి. 5 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

4. 1 టీస్పూన్ ముతక చక్కెరను తీసుకుని ఆపై కొద్దిగా బాదం నూనె, తేనె, కాఫీ కలిపి పేస్ట్‌లా తయారు చేయాలి. దానిని ముఖానికి అప్లైచేసి 10 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత కడిగేస్తే ముఖంపై ఉన్న మచ్చలు తొలగిపోతాయి.

దారుణం.. కూతురు పుట్టిందని చంపేసింది..! ఎలా చంపాలో స్మార్ట్‌ఫోన్‌లో వెతికింది..

Boiled Lemon: ఉడికించిన నిమ్మకాయలో అద్భుత ఔషధ గుణాలు..! ఈ 5 సమస్యలకి చక్కటి పరిష్కారం..

Viral Video: అడవి పిల్లి హాలివుడ్ స్టంట్.. యాక్షన్ హీరోకే పోటీ.. దుమ్ములేపుతున్న వీడియో.!