Boiled Lemon: ఉడికించిన నిమ్మకాయలో అద్భుత ఔషధ గుణాలు..! ఈ 5 సమస్యలకి చక్కటి పరిష్కారం..

Boiled Lemon: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో నిమ్మరసం ఒకటి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. నిమ్మరసాన్ని

Boiled Lemon: ఉడికించిన నిమ్మకాయలో అద్భుత ఔషధ గుణాలు..! ఈ 5 సమస్యలకి చక్కటి పరిష్కారం..
Lime Water
Follow us
uppula Raju

|

Updated on: Oct 23, 2021 | 9:55 PM

Boiled Lemon: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో నిమ్మరసం ఒకటి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. నిమ్మరసాన్ని అనేక పదార్థాలతో కలుపుకొని తీసుకోవచ్చు. అయితే ఈ రోజు ఉడికించిన నిమ్మరసం ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం. ఈ పానీయం సిద్ధం చేయడానికి చల్లని నీటికి బదులు వేడి నీటిని ఉపయోగిస్తారు.

1. పోషకాలు సాధారణంగా నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అదనంగా సిట్రిక్ పండులో ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శక్తివంతమైన వ్యాధి-పోరాట లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ పానీయంలో కొవ్వు, పిండి పదార్థాలు, చక్కెర తక్కువగా ఉంటుంది. కానీ పొటాషియం, ఫోలేట్, విటమిన్ బి సహా అనేక విటమిన్లు ఖనిజాలు ఉంటాయి. ప్రతి గ్లాసు నిమ్మరసం పోషక విలువ దానికి కలిపిన ఇతర ఆహార పదార్ధాలపై ఆధారపడి ఉంటుంది.

2. చర్మ పరిస్థితిని మెరుగు విటమిన్ సి, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. నిమ్మ నీరు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని కాపాడుతుంది. ఇది వృద్ధాప్య సంకేతాలను, మొటిమలను తగ్గిస్తుంది. విటమిన్ సి తీసుకోవడం వల్ల గాయాలు వేగంగా తగ్గుతాయి. చర్మం యవ్వనంగా కాంతివంతంగా కనిపిస్తుంది.

3. బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది నిమ్మకాయ పానీయాలు రక్తపోటును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. అధిక రక్తపోటుతో బాధపడేవారిలో కాల్షియం, పొటాషియం రెండూ రక్తపోటును తగ్గిస్తాయి.

4. రోగనిరోధక శక్తిని పెంచుతుంది విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటుంది. ప్రతిరోజూ ఈ పానీయం తాగడం వల్ల COVID, ఫ్లూ వంటి శ్వాసకోశ రుగ్మతలకు దూరంగా ఉండవచ్చు. మీ ఆరోగ్యాన్ని ఫిట్‌గా చేయడంలో సహాయపడుతుంది.

5. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మీరు తరచుగా మలబద్ధకం, ఉబ్బరం లేదా గుండెల్లో మంట వంటి సమస్యలతో బాధపడితే భోజనం తర్వాత ఒక గ్లాసు నిమ్మరసం తాగితే చాలు. ఈ సమస్యలన్నింటి నుంచి బయటపడవచ్చు.

6. దీన్ని ఎలా సిద్ధం చేయాలి? నిమ్మకాయను సగానికి కోసి బాగా పిండి రసం తీయాలి. ఒక గ్లాసు మరిగే నీటిలో కలపాలి. చల్లారిని తర్వాత తాగాలి. మరొక విధానంలో నిమ్మకాయను ముక్కలుగా కట్ చేసి, గ్లాస్‌ వేడి నీటిలో ఉంచాలి. చల్లారిన తర్వాత తాగాలి.

T20 World Cup: పాకిస్తాన్‌ భరతం పట్టనున్న టీమిండియా.. ఆ వరల్డ్‌కప్ హీరోస్‌లో ఇప్పుడు ఆడేది ముగ్గురే.!

Viral Photos: ఆ నగరంలో ఇళ్లు కట్టుకోవడానికి ఉచిత భూమి..! కానీ ఒక షరతు.. ఏంటంటే..?

Akash Puri: “నో ఇట్స్ నాట్ ఓవర్.. నాన్న నిన్ను కాలర్ ఎగిరేసేలా చేస్తాను”: ఆకాష్ పూరి

మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..