Akash Puri: “నో ఇట్స్ నాట్ ఓవర్.. నాన్న నిన్ను కాలర్ ఎగిరేసేలా చేస్తాను”: ఆకాష్ పూరి

యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో వస్తోన్న ‘రొమాంటిక్’ చిత్రం అక్టోబర్ 29 విడుదల కాబోతోంది.

Akash Puri: నో ఇట్స్ నాట్ ఓవర్.. నాన్న నిన్ను కాలర్ ఎగిరేసేలా చేస్తాను: ఆకాష్ పూరి
Akash
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 23, 2021 | 9:47 PM

Akash Puri: యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో వస్తోన్న ‘రొమాంటిక్’ చిత్రం అక్టోబర్ 29 విడుదల కాబోతోంది. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రొమాంటిక్ సినిమాకు అనిల్ పాదూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రొమాంటిక్ గ్రాండ్ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను వ‌రంగ‌ల్‌లో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు లైగ‌ర్‌ విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ.. ‘రొమాంటిక్ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా? అని చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాను అన్నారు. ఈ రెండు మూడేళ్లు ప్రాణం పెట్టి సినిమా చేశాం అన్నారు. రమ్యకృష్ణ గారు ఈ చిత్రంలో ఓ స్పెషల్ రోల్ చేశారు. మా అందరికీ ఈ చిత్రం అవసరం కానీ.. ఈ సినిమాకు రమ్యకృష్ణ గారు అవసరం. కేతిక శర్మ కచ్చితంగా స్టార్ అవుతుంది అన్నాడు ఆకాష్.

అలాగే పూరిజగన్నాథ్ గురించి మాట్లాడుతూ ఆకాష్ ఎమోషనల్ అయ్యాడు. ఏ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. ఎక్కడో నర్సీపట్నంలో పుట్టి ఇండస్ట్రీకి వచ్చాడు. కష్టపడి ఇండస్ట్రీ అనే మహాసముద్రంలోకి దూకేశాడు. ఇండస్ట్రీకి వచ్చి ఓ బస్సు కొన్నారు. అందులో మా అందరినీ అందులో పెట్టుకుని లాంగ్ జర్నీ మొదలుపెట్టారు. ఓ రాంగ్ పర్సన్ వల్ల జర్నీ ఆగిపోయింది. కానీ మా నాన్న ఒక్కడే బస్సును తోయడం మొదలుపెట్టారు. కొన్నేళ్లుగా తోస్తూనే ఉన్నారు. మా నాన్న గురించి ఎవరైనా బ్యాడ్ కామెంట్లు పెడితే వాళ్ల‌ని కొట్టాలని అనిపించేది. ఇక పూరి సినిమాలు ఎవరు చూస్తారు.. టైం అయిపోయిందని అందరూ అన్నారు. కానీ ఇస్మార్ట్ శంకర్‌తో ఫుల్ హై ఇచ్చారు. కెరీర్ అయిపోయింది అని అన్నవాళ్లకు నేను చెబుతున్నాను.. నీ యబ్బ కొట్టాడ్రా మా వాడు. కాలర్ ఎగిరేసే మూమెంట్ ఇచ్చినందుకు మా నాన్నకు థ్యాంక్స్. జీవితంలో సక్సెస్ అవ్వడం ఫెయిల్ అవ్వడం కాదు.. మనం చేసే పనిని ఇష్టపడటం అని మా నాన్న చెప్పారు. కానీ నా విషయంలో అది సరిపోదు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఫెయిల్ అయితే కాస్త సానుభూతి చూపిస్తారేమో. కానీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నోడు ఫెయిల్ అయితే మనిషిలా కూడా చూడరు. నీ కొడుగ్గా పుట్టడం నా అదృష్టం. నేను కచ్చితంగా సక్సెస్ అవుతాను. ఈడు హీరో ఏంటి..కెరీర్ అయిపోయింది అనే మాటలు విన్నాను. నేను నీ కొడుకుగా పుట్టడం నా అదృష్టం కానీ నువ్ నా కొడుకు ఆకాష్ పూరి అని చెప్పుకునేలా చేస్తాను. ప్రతీ సినిమా మొదటి చిత్రం అనుకుని చేయమన్నావ్ కానీ ఇదే నా లాస్ట్ సినిమా అన్నట్టు చేస్తాను. ప్రాణం పెట్టి చేస్తాను. నా కెరీర్ అయిపోయిందని మాట్లాడుకున్న ప్రతీ ఒక్కరికి నేను చెబుతున్నా.. నో ఇట్స్ నాట్ ఓవర్. నిన్ను కాలర్ ఎగిరేసేలా చేస్తాను. అది ఎప్పుడు అవుతుందో చెప్పలేను. కానీ కచ్చితంగా చేస్తాను. ఇక్కడ నేను కొట్టాలి.. నువ్ కాలర్ ఎగిరెయ్యాలి అని ఎమోషనల్ అయ్యాడు ఆకాష్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral News: బీహార్‌లో హాట్ టాపిక్‌గా మారిన నటుడు రామిరెడ్డి.. తెలుగు దివంగత నటుడు అక్కడ ఎందుకనేగా..

RK Selvamani: దర్శకుడు సెల్వమణి బర్త్ డే వేడుకలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోస్..

Mahesh Babu: సర్కారు వారి పాటకు శేఖర్‌ మాస్టర్‌ స్టెప్పులు.. సినిమా సెట్‌లో దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ..