Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Devudu : చరిత్ర సృష్టించిన వ్యక్తి పాత్రలో చేయడం నిజంగా గర్వంగా ఉంది: శ్రీకాంత్

మ్యాక్ లాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై హరీష్ వడత్యా దర్శకత్వంలో మొహహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’.

Telangana Devudu : చరిత్ర సృష్టించిన వ్యక్తి పాత్రలో చేయడం నిజంగా గర్వంగా ఉంది: శ్రీకాంత్
Telangana Devudu
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 23, 2021 | 9:01 PM

Telangana Devudu : మ్యాక్ లాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై హరీష్ వడత్యా దర్శకత్వంలో మొహహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. ఉద్యమనాయకుడి పాత్రలో పబ్లిక్ స్టార్‌ శ్రీకాంత్‌ నటించగా.. జిషాన్ ఉస్మాన్ హీరోగా పరిచయం అవుతున్నారు. సంగీత, బ్రహ్మానందం, సునీల్‌, సుమన్‌, తనికెళ్ల భరణి వంటి 50 మంది అగ్ర నటీనటులు నటించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని నవంబర్ 12న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ శుక్రవారం చిత్రయూనిట్ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో చేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. చరిత్ర సృష్టించిన వ్యక్తి పాత్రలో చేయడం నిజంగా గర్వంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. కరోనా లాక్‌డౌన్ కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. నవంబర్ 12న సినిమా విడుదలవుతుంది..’’ అని అన్నారు.

దర్శకుడు హరీష్‌ వడత్యా మాట్లాడుతూ.. ‘‘ ‘తెలంగాణ దేవుడు’ వంటి గొప్ప చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ధైర్యం ఇచ్చిన నిర్మాత జాకీర్ ఉస్మాన్ గారికి, చిత్రం ఇంత బాగా రావడానికి సహకరించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు నా ధన్యవాదాలు. నవంబర్ 12న మా ‘తెలంగాణ దేవుడు’ చిత్రాన్ని గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నాం..’’ అని తెలిపారు.  ఇంకా ఈ కార్యక్రమంలో హీరో జిషాన్ ఉస్మాన్, చిట్టిబాబు, కాశినాధ్, అప్పాజీ, బస్టాప్ కోటేశ్వరరావు, డాక్టర్ శ్రీహరి, బుల్లెట్ భాస్కర్, మ్యాక్ లాబ్ సిఈఓ మొహ్మద్ ఇంతెహాజ్‌ అహ్మద్‌, సంగీత దర్శకుడు నందన్ రాజ్ బొబ్బిలి, మహమూద్ అజ్మతుల్లా, లైన్ ప్రొడ్యూసర్ మహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral News: బీహార్‌లో హాట్ టాపిక్‌గా మారిన నటుడు రామిరెడ్డి.. తెలుగు దివంగత నటుడు అక్కడ ఎందుకనేగా..

RK Selvamani: దర్శకుడు సెల్వమణి బర్త్ డే వేడుకలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోస్..

Mahesh Babu: సర్కారు వారి పాటకు శేఖర్‌ మాస్టర్‌ స్టెప్పులు.. సినిమా సెట్‌లో దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ..

డగౌట్ నుంచే ఢిల్లీపై మరణ శాసనం.. బ్రహ్మ రాతనే మార్చేసిన రోహిత్
డగౌట్ నుంచే ఢిల్లీపై మరణ శాసనం.. బ్రహ్మ రాతనే మార్చేసిన రోహిత్
ఇక సర్కారు బడుల్లోనూ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ క్లాసులు..
ఇక సర్కారు బడుల్లోనూ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ క్లాసులు..
పేరులేని రైల్వే స్టేషన్.. కారణం తెలిస్తే షాకే..
పేరులేని రైల్వే స్టేషన్.. కారణం తెలిస్తే షాకే..
బెంగళూరు లైంగింక వేధింపుల నిందితుడు అరెస్ట్..ఎక్కడ దొరికాడంటే?
బెంగళూరు లైంగింక వేధింపుల నిందితుడు అరెస్ట్..ఎక్కడ దొరికాడంటే?
చార్ ధామ్ యాత్రలో ముందు ఏ క్షేత్రాన్ని దర్శించుకోవాలి? ప్రాముఖ్యత
చార్ ధామ్ యాత్రలో ముందు ఏ క్షేత్రాన్ని దర్శించుకోవాలి? ప్రాముఖ్యత
అమరావతి 2.0.. మరో 44 వేల ఎకరాల భూ సేకరణకు సన్నద్ధం..
అమరావతి 2.0.. మరో 44 వేల ఎకరాల భూ సేకరణకు సన్నద్ధం..
బుమ్రా, కరుణ్ నాయర్ గొడవ.. రోహిత్ ఎక్స్‌ప్రెషన్స్ నెక్ట్స్ లెవల్
బుమ్రా, కరుణ్ నాయర్ గొడవ.. రోహిత్ ఎక్స్‌ప్రెషన్స్ నెక్ట్స్ లెవల్
56 కేజీల బరువు తగ్గిన మహిళ.. ఇదే రహస్యం
56 కేజీల బరువు తగ్గిన మహిళ.. ఇదే రహస్యం
ఊపిరి తిత్తులకు శ్రీ రామ రక్ష ఈ హెర్బల్ టీలు.. మిల్క్ టీకి బదులు.
ఊపిరి తిత్తులకు శ్రీ రామ రక్ష ఈ హెర్బల్ టీలు.. మిల్క్ టీకి బదులు.
ఉదయమే నిద్రలేచిన ఊరు ఉలిక్కిపాటు.. భవనానికి వేలాడిన డెడ్ బాడీ!
ఉదయమే నిద్రలేచిన ఊరు ఉలిక్కిపాటు.. భవనానికి వేలాడిన డెడ్ బాడీ!