Mahesh Babu: సర్కారు వారి పాటకు శేఖర్‌ మాస్టర్‌ స్టెప్పులు.. సినిమా సెట్‌లో దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ..

Mahesh Babu: మహేశ్‌ బాబు హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం సర్కారు వారి పాట. వరుస విజయాల తర్వాత మహేస్‌ బాబు నటిస్తోన్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు..

Mahesh Babu: సర్కారు వారి పాటకు శేఖర్‌ మాస్టర్‌ స్టెప్పులు.. సినిమా సెట్‌లో దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ..
Shekar Master Mahesh Babu
Follow us

|

Updated on: Oct 23, 2021 | 3:41 PM

Mahesh Babu: మహేశ్‌ బాబు హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం సర్కారు వారి పాట. వరుస విజయాల తర్వాత మహేస్‌ బాబు నటిస్తోన్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక అభిమానుల అంచనాకు తగ్గట్లుగానే దర్శకుడు పరశురామ్ భారీగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఈ సినిమాను భారీ లోకేషన్‌లలో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్‌ సరసన, కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్‌లో శరవేగంగా జరుపుకుంటోంది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోని విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా చిత్ర యూనిట్‌ మళ్లీ షూటింగ్‌ వేగాన్ని పెంచేసింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ పాటకు శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయనే ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్వయంగా తెలిపాడు. ఈ క్రమంలోనే స్పెయిన్‌లో సినిమా షూటింగ్‌ సెట్‌లో మహేష్‌తో దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ.. ‘మరోసారి మహేష్‌ బాబు సార్‌ సినిమా సర్కారు వారి పాటకి కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాను. మహేష్‌ గారితో షూటింగ్‌ ఎప్పుడూ ఓ మధురానుభూతిని ఇస్తుంది’ అంటూ క్యాప్షన్‌ జోడించాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు తమన్‌ సంగీతాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా మ్యూజిక్‌ కంపోజిషన్‌ పూర్తయింది. ఈ విషయాన్ని తమన్ స్వయంగా ట్విట్టర్‌ వేదికగా అభిమానులకు తెలిపాడు. మహేష్‌తో దిగిన ఫోటోను పోస్ట్‌ చేస్తూ ఈ విషయాన్ని ట్వీట్ చేశాడు తమన్‌. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్‌ను త్వరగా పూర్తి చేసి 2022 సంక్రాతికి విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

Also Read: Earthquake: పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో భూకంపం.. బయటకు పరుగులు తీసిన జనం.. అసలు ఏం జరిగిందంటే..

Pattabhi Case: పట్టాభి భార్య చందన ఫిర్యాదుపై విచారణ స్పీడప్.. ఇంటిపై దాడి కేసులో 11 మంది అరెస్ట్: సీపీ

Krithi Shetty Photos: కుర్రకారు కళల రాకుమారి.. దేవకన్యలా మెరుస్తున్న అందాల కృతిశెట్టి… (ఫోటోస్)

బేకరీల్లో లభించే ఆనియన్ కచోరిని ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చిలా!
బేకరీల్లో లభించే ఆనియన్ కచోరిని ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చిలా!
ఇక్కడి చింతచెట్టు గింజలు ఎక్కడా మొలకెత్తవు ఈ ఆలయంలో అన్నీ వింతలే
ఇక్కడి చింతచెట్టు గింజలు ఎక్కడా మొలకెత్తవు ఈ ఆలయంలో అన్నీ వింతలే
మీ జనన ధృవీకరణ పత్రం పోయిందా..?  ఇలా దరఖాస్తు చేసుకోండి!
మీ జనన ధృవీకరణ పత్రం పోయిందా..?  ఇలా దరఖాస్తు చేసుకోండి!
గుండె జబ్బులున్న వారు ఎక్కువ నీరు తాగకూడదా? నిపుణులు ఏమంటున్నారు?
గుండె జబ్బులున్న వారు ఎక్కువ నీరు తాగకూడదా? నిపుణులు ఏమంటున్నారు?
పీతల కర్రీ చేయడం రాదా.. ఇదిగో ఈ రెసిపీ ఫాలో అయిపోండి!
పీతల కర్రీ చేయడం రాదా.. ఇదిగో ఈ రెసిపీ ఫాలో అయిపోండి!
ఎర్ర ఉల్లిగడ్డ, తెల్ల ఉల్లిగడ్డలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా.?
ఎర్ర ఉల్లిగడ్డ, తెల్ల ఉల్లిగడ్డలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా.?
నిశిధీలో అందాల రాకూమారి.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్..
నిశిధీలో అందాల రాకూమారి.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్..
మీక్కూడా తినగానే ఈ అలవాటు ఉందా.? దంతాలు డేంజర్‌లో పడ్డట్లే..
మీక్కూడా తినగానే ఈ అలవాటు ఉందా.? దంతాలు డేంజర్‌లో పడ్డట్లే..
ఇంట్లో ఏ దిక్కులో ఏ ఫొటోలు పెట్టాలో తెలుసా.?
ఇంట్లో ఏ దిక్కులో ఏ ఫొటోలు పెట్టాలో తెలుసా.?
ఈ సూపర్ క్యూట్ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా ?..
ఈ సూపర్ క్యూట్ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా ?..