Pattabhi Case: పట్టాభి భార్య చందన ఫిర్యాదుపై విచారణ స్పీడప్.. ఇంటిపై దాడి కేసులో 11 మంది అరెస్ట్: సీపీ

టీడీపీ అధికార ప్రతినిధి, పార్టీ సీనియర్ నేత పట్టాభిరామ్ ఇంటిపై దాడి కేసులో ఇప్పటివరకు 11 మంది అరెస్ట్ చేశామని విజయవాడ

Pattabhi Case: పట్టాభి భార్య చందన ఫిర్యాదుపై విచారణ స్పీడప్.. ఇంటిపై దాడి కేసులో 11 మంది అరెస్ట్: సీపీ
Pattabhi House Attack Case
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 23, 2021 | 1:55 PM

TDP Leader Pattabhiram’s House Attack Case: టీడీపీ అధికార ప్రతినిధి, పార్టీ సీనియర్ నేత పట్టాభిరామ్ ఇంటిపై దాడి కేసులో ఇప్పటివరకు 11 మంది అరెస్ట్ చేశామని విజయవాడ సీపీ వెల్లడించారు. పట్టాభి భార్య చందన ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ వేగవంతం చేశామని ఇవాళ విడుదల చేసిన ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. దాడి జరిగిన ప్రాంతంలోని ఆధారాలు, చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఆధారంగా 11 మంది అరెస్ట్ చేసినట్టు తెలిపారు. పట్టాభి ఇంటిలోని సీసీ ఫుటేజీ డీవీఆర్ ఇవ్వమని కోరామని.. డీవీఆర్ అందిన తర్వాత విచారణ మరింత వేగవంతం చేస్తామని సదరు ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా, పట్టాభి భార్య చందన ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసిన పడమట పోలీసులు.. రాత్రి పదకొండు మంది నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఆ పదకొండు మంది విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. ఇంటి చుట్టు ప్రక్కల సిసి కెమెరాల ఆధారంగా పదకొండు మందిని గుర్తించామని.. పట్టాభి ఇంట్లో ఉన్న డివిఆర్ ఇచ్చిన తర్వాత మిగిలిన వారిని గుర్తించి అరెస్ట్ చేస్తామని సీపీ శ్రీనివాసులు తెలిపారు.