Vasireddy Padma: మహిళా పక్షపాతి అయిన సీఎం వైయ‌స్‌ జగన్‌ను విమర్శిస్తే సహించేది లేదు: మహిళా కమిషన్ ఛైర్ పర్సన్

ఆంధ్రప్రదేశ్‌లో ఆడవారిని తిట్టే స్థాయికి రాజకీయాలు దిగజారాయని మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్సన్‌ వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు.

Vasireddy Padma: మహిళా పక్షపాతి అయిన సీఎం వైయ‌స్‌ జగన్‌ను విమర్శిస్తే సహించేది లేదు: మహిళా కమిషన్ ఛైర్ పర్సన్
Vasireddy Padma
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 23, 2021 | 2:10 PM

Vasireddy Padma: ఆంధ్రప్రదేశ్‌లో ఆడవారిని తిట్టే స్థాయికి రాజకీయాలు దిగజారాయని మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్సన్‌ వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. మహిళా హోంమంత్రిని కూడా తిడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విజ‌య‌వాడ‌ వాసిరెడ్డి పద్మ ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఏపీలో మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నారని వాసిరెడ్డి పద్మ ఈ సందర్భంగా అన్నారు.

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పదవులు, పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు సముచిత స్థానాన్ని ఇచ్చారని పద్మ కొనియాడారు. మహిళా పక్షపాతి అయిన వైయ‌స్ జగన్ ను విమర్శిస్తే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు. మహిళలకు వైయ‌స్ జగన్ ఇచ్చినంత ప్రాధాన్యత గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదని అన్నారు. సీఎంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి అయ్యాక, మహిళల్లో ఎంతో మార్పు వస్తోందని… ప్రతిపక్షాలు ఇకనైనా మారాలని పద్మ చెప్పుకొచ్చారు.

మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తుండటాన్ని అన్ని పార్టీలు ఆహ్వానించాలని, అలా చేయకుండా విమర్శలు గుప్పిస్తుండటం దారుణమని అన్నారు. మహిళా హోంమంత్రిని కూడా కించపరుస్తూ మాట్లాడటం దురదృష్టకరమని చెప్పారు. ఇది ముమ్మాటికీ దళితులపై జరుగుతున్న దాడేనని వాసిరెడ్డి పద్మ అన్నారు.

Read also: Pattabhi Case: పట్టాభి భార్య చందన ఫిర్యాదుపై విచారణ స్పీడప్.. ఇంటిపై దాడి కేసులో 11 మంది అరెస్ట్: సీపీ