Surekha Vani: కూతురుతో కలిసి సురేఖ వాణి ఫాస్ట్‌ బీట్‌ స్టెప్పులు…చూస్తే అదిరిపోవాల్సిందే..

సురేఖ వాణి... క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలు నటించిన ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హీరో హీరోయిన్లకి అక్కగా, వదినగా, అత్తగా ఇలా ఎన్నో...

Surekha Vani: కూతురుతో కలిసి సురేఖ వాణి ఫాస్ట్‌ బీట్‌ స్టెప్పులు...చూస్తే అదిరిపోవాల్సిందే..
Follow us
Basha Shek

|

Updated on: Oct 23, 2021 | 3:34 PM

సురేఖ వాణి… క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలు నటించిన ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హీరో హీరోయిన్లకి అక్కగా, వదినగా, అత్తగా ఇలా ఎన్నో పాత్రల్లో అభినయించి ఆకట్టుకుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా సినిమాల్లో కనిపించకపోయినా తరచూ వార్తల్లో మాత్రం నిలుస్తోంది. సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఆమె తన కూతురు సుప్రియతో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో చేసే సందడి మామూలుగా ఉండడం లేదు. సిల్వర్‌ స్ర్కీన్‌పై ఎక్కువగా సంప్రదాయ దుస్తుల్లోనే కనిపించిన సురేఖ నిజ జీవితంలో మాత్రం ట్రెడిషినల్‌ లుక్‌లోనే దర్శనమిస్తుంది. ఈ మేరకు తన కూతురుతో కలిసి తరచుగా డ్యాన్స్‌ వీడియోలు చేస్తూ వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తోందీ అందాల తార. ఇలా తల్లీ కూతుళ్లు చేస్తోన్న వీడియోలపై కొన్నిసార్లు ట్రోల్స్‌ కూడా వస్తున్నాయి. అయితే వీరు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. తాజాగా మరి కొన్ని డ్యాన్స్‌ వీడియోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారీ తల్లీ కూతుళ్లు.

ఈ వీడియోల్లో సుప్రిత బ్లాక్‌ కలర్‌ టీ-షర్ట్‌, టార్న్‌ జీన్స్‌ ప్యాంట్‌ ధరించి గ్లామరస్‌గా కనిపించగా…సురేఖ కూడా కూతురుతో పోటీ పడుతూ రెడ్‌ కలర్‌ టీ-షర్ట్‌, బ్లూ జీన్స్‌ ధరించింది. ఇక ఫాస్ట్‌ బీట్‌ ట్యూన్స్‌కి తగ్గట్టుగా వీరిద్దరు వేసిన స్టెప్పులకు నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘స్టన్నింగ్‌ బ్యూటీస్‌… మీరు తల్లీ కూతుళ్లలా కాదు… అక్కా చెల్లెళ్లలా కనిపిస్తున్నారు’ అని కామెంట్ పెట్టగా మరికొందరు మాత్రం ‘ ఎంత పద్ధతిగా ఉన్నారో’ అంటూ వెటకారం చేశాడు. ‘సుప్రితను సినిమాల్లోకి తీసుకొచ్చేందుకే సురేఖ ఇలా చేస్తోంది’ అని ఇంకొందరు స్పందించారు. అయితే తన కూతురు సినీ రంగ ప్రవేశంపై గతంలోనే స్పందించిన సురేఖ…అది తన కూతురు వ్యక్తిగత నిర్ణయమని, తను సినిమాల్లోకి వస్తానంటే కాదన్నంటూ చెప్పుకొచ్చింది.

Also Read:

Prabhas Birthday: సూపర్ హీరోగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ప్రాజెక్ట్ K టీమ్..

Rashmika Mandanna: సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ‘రష్మిక మందన్న’..(ఫొటోస్)

Samantha-chardham-shilpa reddy: విడాకుల తరువాత భక్తి పరవశంలో మునకలేస్తున్న ‘సమంత’… ఫ్రెండ్ ‘శిల్ప రెడ్డి’ కలిసి ఫొటోస్..