Prabhas Birthday: సూపర్ హీరోగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ప్రాజెక్ట్ K టీమ్..

Happy Birthday Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ దేశాలు దాటి పోయింది.

Prabhas Birthday: సూపర్ హీరోగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ప్రాజెక్ట్ K టీమ్..
Prabhas New
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 23, 2021 | 3:00 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ దేశాలు దాటి పోయింది. దాంతో ప్రభాస్ పుట్టిన రోజున ఇతరదేశాల్లోని ప్రభాస్ అభిమానులు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలు లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని సినిమాల అప్డేట్స్ కూడా వచ్చేశాయి. రాధేశ్యామ్ సినిమానుంచి టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ స్టైలిష్ గా కనిపించనున్నాడు. ఇక ప్రభాస్ కు జోడీగా బుట్టబొమ్మ పూజాహెగ్డే నటిస్తుంది. తాజాగా ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమానుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

నాగశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సోషియో ఫాంటసీ మూవీ అని తెలుస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికాపదుకునే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే గ్రాఫిక్స్ వర్క్ కూడా స్టార్ట్ చేశామని నిర్మాత ఇటీవలే వెల్లడించారు. నవంబర్ లో మొదలయ్యే షెడ్యూల్ లో ప్రభాస్ – అమితాబ్ తో పాటుగా మిగతా ప్రధాన తారాగణమంతా పాల్గొంటారని తెలుస్తుంది. లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ ఈ చిత్రానికి మెంటర్ గా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ప్రభాస్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. సూపర్ హీరోకి.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రాజెక్ట్ Kసెట్స్ కి మిమ్మల్ని స్వాగతిస్తున్నందుకు మేము సూపర్ ఎగ్జైటింగ్ గా ఉన్నాం… అంటూ రాసుకొచ్చారు. దాంతో ఈ సినిమా ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించనున్నాడని అందరు భావిస్తున్నారు. ఈ వార్త తెలిసిన ప్రభాస్ అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. మరి నిజంగా ప్రభాస్ ఈసినిమాలో సూపర్ హీరోగా కనిపిస్తాడేమో చూడాలి. ఈ సినిమా స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rashmika Mandanna: సోషల్ మీడియాలో విచ్చలవిడిగా రచ్చ చేస్తున్న ‘రష్మిక మందన్న’..(ఫొటోస్)

Samantha-chardham-shilpa reddy: విడాకుల తరువాత భక్తి పరవశంలో మునకలేస్తున్న ‘సమంత’… ఫ్రెండ్ ‘శిల్ప రెడ్డి’ కలిసి ఫొటోస్..

Prabhas Birthday: ప్రభాస్‌కు స్వీటీ బర్త్ డే విషెస్‌…ది బెస్ట్ అందుకోవాలని ట్వీట్‌..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే