Earthquake: పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో భూకంపం.. బయటకు పరుగులు తీసిన జనం.. అసలు ఏం జరిగిందంటే..
పెద్దపల్లి జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి. రామగుండం, పెద్దపల్లిలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో భయపడిన జనం బయటకు పరుగులు తీశారు. సీతారాంపల్లెలోనూ స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి.
తెలంగాణలోని పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. శనివారం మధ్యాహ్నం 2 గంటల 3 నిమిషాల సమయంలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4 తీవ్రతగా నమోదయింది. కరీంనగర్‌కు ఈశాన్యంగా 45 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. రామగుండం, పెద్దపల్లిలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో భయపడిన జనం బయటకు పరుగులు తీశారు. సీతారాంపల్లెలోనూ స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి.
మంచిర్యాల జిల్లాలో పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. మంచిర్యాల, రాంనగర్, నస్పూర్, గోసేవ మండల్ కాలనీలో భూమి కంపించింది. భూమి కదలికలు గుర్తించిన జనం భయంతో ఇళ్లలో నుంచి బయటకు పెరుగెత్తారు. దాదాపు రెండు సెకండ్లపాటు భూమి కంపించినట్లు తెలుస్తోంది. ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.