Huzurabad By Election: రేవంత్‌రెడ్డిని కలిసింది వాస్తవమే.. కానీ ఇప్పుడు కలవలేదు.. ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు..
కేటీఆర్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. రేవంత్‌రెడ్డిని కలిసింది వాస్తవమేనని చెప్పారు. కానీ రేవంత్‌రెడ్డిని ఇప్పుడు కలవలేదని తెలిపారు...
బీజేపీ నేత ఈటల, తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గోల్కోండ రిసార్ట్‌లో రహహ్యంగా కలిశారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. వారు కలిసిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్య ఠాగూర్ 50 కోట్లకు అమ్ముడుపోయి.. రేవంత్‌కు పార్టీ పగ్గాలు ఇచ్చారన్నారు. గాంధీభవన్‌లో గాడ్సేలు దూరారని ఎద్దేవా చేశారు. ఆర్ఆర్ఆర్ మూలాలు ఉన్న వ్యక్తులకు కాంగ్రెస్‌లో అగ్ర తాంబూలాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యానని కేటీఆర్ విమర్శించారు. చీకటి ఒప్పందాలను హుజూరాబాద్ ప్రజలు తిప్పికొడతారని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిగా ఈటల బరిలో ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ సైతం రాజ్యాంగబద్ధమైన పరిధిని దాటి వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుంన్నారు. ఇప్పటికే ప్రారంభమైన దళిత బంధు పథకంను ఆపడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలన్నారు. ఇప్పుడు పక్క జిల్లాలకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటున్న ఎలక్షన్ కమిషన్ భవిష్యత్తులో పక్క రాష్ట్రాలకు సైతం విస్తరిస్తూ ఉందేమో అనిపిస్తుందని వ్యాఖ్యానించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. రేవంత్‌రెడ్డిని కలిసింది వాస్తవమేనని చెప్పారు. కానీ రేవంత్‌రెడ్డిని ఇప్పుడు కలవలేదని తెలిపారు. రాజీనామా చేసిన తర్వాత కలిసినట్లు ఈటల వెల్లండిచారు. రేవంత్‌రెడ్డిని కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. రాజీనామా చేశాక అన్ని పార్టీల నేతలను కలిశానని తెలిపారు. తెలంగాణలో ఉద్యమంలోనూ అన్ని పార్టీల మద్దతు కోరలేదా అని అన్నారు. అభివృద్ధి కోసం చాలా మందిని కలుస్తామని ఈటల స్పష్టం చేశారు. హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 30న హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న ఫలితాలు రానున్నాయి. గెలుపుపై ఇటు బీజేపీ అటు టీఆర్ఎస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Read Also.. Etela Rajender: సింగపూర్‌లో ఈటల ఎన్నికల ప్రచారం.. కళ్లలో మట్టికొట్టిది ముమ్మాటికీ ఆయనేనంటూ ఘాటు వ్యాఖ్యలు