- Telugu News Photo Gallery Viral photos Free land given in this city of australia to increase the population
Viral Photos: ఆ నగరంలో ఇళ్లు కట్టుకోవడానికి ఉచిత భూమి..! కానీ ఒక షరతు.. ఏంటంటే..?
Viral Photos: చైనా, భారతదేశంలో నిరంతరం జనాభా పెరుగుతూనే ఉంటుంది. కానీ ప్రపంచంలో కొన్ని దేశాలు వీటికి పూర్తిగా విరుద్దంగా ఉంటాయి. ఇక్కడ జనాభాను పెంచడానికి ప్రభుత్వం వివిధ మార్గాల్లో ప్రోత్సహిస్తుంది.
Updated on: Oct 23, 2021 | 9:31 PM

చైనా, భారతదేశంలో నిరంతరం జనాభా పెరుగుతూనే ఉంటుంది. కానీ ప్రపంచంలో కొన్ని దేశాలు వీటికి పూర్తిగా విరుద్దంగా ఉంటాయి. ఇక్కడ జనాభాను పెంచడానికి ప్రభుత్వం వివిధ మార్గాల్లో ప్రోత్సహిస్తుంది.

ఇటీవల ఆస్ట్రేలియాలోని క్విల్పీ నగరం నుంచి ఒక ప్రత్యేక కేసు బయటపడింది. ఇక్కడ జనాభాను పెంచడం అధికారులకు ఒక సవాలుగా మారింది.

ఇక్కడ జనాభా చాలా తక్కువ. గణాంకాల ప్రకారం 800 మంది మాత్రమే. జనాభాను పెంచడానికి అధికార యంత్రాంగం ఉచిత భూమి ఆఫర్ ప్రకటించింది.

జనాభా లేమి కారణంగా పశుపోషణ, గొర్రెల పెంపకానికి సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

బ్రిటన్, ఇండియా, హాంకాంగ్, న్యూజిలాండ్ ప్రజలు ఉచిత భూమిని పొందడం గురించి ఆరా తీశారు. అయితే ఇక్కడ ఆస్ట్రేలియా పౌరులు లేదా శాశ్వత నివాసితులుగా ఉన్న వ్యక్తులకు మాత్రమే భూమి ఇస్తున్నారని తెలిసింది.



