Protein Shake: డబ్బు ఖర్చు కాకుండా ఇంట్లోనే ప్రొటీన్‌ షేక్ తయారు చేయండి..! చాలా సులువు..

Protein Shake: శారీరక ధృడత్వం కావాల్సిన వారు కచ్చితంగా ప్రొటీన్‌ షేక్ తాగాలి. కానీ ఇవి చాలా ఖరీదైనవి. అయితే మీరు ఇంట్లో ఉండి కూడా ప్రొటీన్

Protein Shake: డబ్బు ఖర్చు కాకుండా ఇంట్లోనే ప్రొటీన్‌ షేక్ తయారు చేయండి..! చాలా సులువు..
Protien
Follow us
uppula Raju

|

Updated on: Oct 23, 2021 | 3:40 PM

Protein Shake: శారీరక ధృడత్వం కావాల్సిన వారు కచ్చితంగా ప్రొటీన్‌ షేక్ తాగాలి. కానీ ఇవి చాలా ఖరీదైనవి. అయితే మీరు ఇంట్లో ఉండి కూడా ప్రొటీన్ షేక్ తయారు చేసుకోవచ్చు. ఖర్చు కూడా చాలా తక్కువ. ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. సన్నగా ఉన్నవారికి ప్రొటీన్‌ షేక్ చాలా మంచిది. అంతేకాదు బరువు కూడా తొందరగా పెరుగుతారు. ఇంట్లో తయారు చేసిన ఈ ప్రొటీన్‌ షేక్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వ్యాయామం చేసిన తర్వాత ప్రతిరోజూ ప్రోటీన్ షేక్ తీసుకుంటే చాలా మంచిది.

ఇంట్లో ప్రోటీన్ షేక్ ఎలా సిద్ధం చేయాలి మీరు ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో ప్రొటీన్‌ షేక్‌ని సులభంగా తయారుచేసుకోవచ్చు.ఈ ప్రత్యేక షేక్ చేయడానికి మీకు పాలు, అవిసె గింజల పొడి, చాక్లెట్ పౌడర్ అవసరం. అయితే మీరు అవిసె గింజల పొడిని కలిగి ఉండకపోతే దాని విత్తనాల నుంచి ఇంట్లో పొడిని సులువుగా తయారు చేసుకోవచ్చు.

షేక్ ఎలా చేయాలి ఈ ప్రోటీన్ షేక్ చేయడానికి గ్రైండర్‌లో పాలు, అవిసె గింజల పొడి, చాక్లెట్ పౌడర్‌ను వేసి కనీసం 5 నిమిషాలు స్విచ్‌ ఆన్ చేయాలి. ఈ మూడు బాగా మిక్స్ అయ్యాక ఒక గ్లాసులో తీసుకుని తాగాలి. ఈ తాజా ప్రోటీన్ షేక్ మీ శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంట్లో తయారుచేసిన ఈ షేక్‌ని వ్యాయామం చేసిన తర్వాత, తీసుకోవడం వల్ల కొద్ది రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది.

ఇది కాకుండా ప్రయోజనకరమైన మరొక షేక్ ఉంది. దీని కోసం మీకు 1 అరటిపండు, 1 కప్పు పాలు, 1 టేబుల్ స్పూన్ బాదం పొడి, 2 టేబుల్ స్పూన్లు డార్క్ చాక్లెట్ అవసరం. ముందుగా అరటిపండును చిన్న ముక్కలుగా కట్ చేసి, ఆపై డార్క్ చాక్లెట్, బాదం పొడి వేసి బాగా కలపాలి. దీని తరువాత పాలు వేసి మిక్సర్‌తో మళ్లీ కలపాలి. తర్వాత గ్లాసులో తీసుకొని తాగాలి. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బరువు పెంచడంలో తోడ్పడుతుంది.

AP Weather Report: ఏపీలో క్రమంగా తగ్గుతున్న నైరుతి ప్రభావం.. రాగల 3 రోజుల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు

Samantha-chardham-shilpa reddy: విడాకుల తరువాత భక్తి పరవశంలో మునకలేస్తున్న ‘సమంత’… ఫ్రెండ్ ‘శిల్ప రెడ్డి’ కలిసి ఫొటోస్..

Huzurabad By Election: రేవంత్‌రెడ్డిని కలిసింది వాస్తవమే.. కానీ ఇప్పుడు కలవలేదు.. ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు..