Blood Pressure: అధిక రక్తపోటు వేధిస్తుందా..? అయితే.. ఈ ఆహార పదార్థాలను తీసుకోండి..
Health Tips for Blood Pressure: ఒత్తిడి, ఆందోళన, సరైన నిద్రలేకపోవడం వల్ల రక్తపోటు నియంత్రణ లేకుండా పెరిగిపోతుంటుంది. అధిక రక్తపోటు వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. తలనొప్పి నుంచి మొదలై గుండెపోటు వరకు దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో.. మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే బీపీని నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం..
Updated on: Oct 23, 2021 | 1:50 PM

బీట్‌రూట్: బీట్‌రూట్‌లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో పుష్కలంగా ఉన్న పోషకాలు.. బీపీని నియంత్రిస్తాయి. దీనిలో ఫైబర్, ఐరన్, పొటాషియం, విటమిన్ సి పోషకాలు అధికంగా ఉన్నాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. బీట్‌రూట్‌లో ఉన్న నైట్రేట్‌లు రక్త ధమనులను తెరుచుకునేలా చేస్తాయి. ఇది రక్త ప్రవాహానికి సహాయపడి అధిక రక్తపోటును నియంత్రిస్తాయి.

నిమ్మరసం: చాలామంది నిమ్మరసంతో రోజును ప్రారంభిస్తారు. లెమన్ వాటర్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీంతోపాటు ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది శరీరం నుంచి ఫ్రీ రాడికల్స్ తొలగించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు నిమ్మరసం తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. దీంతోపాటు బరువు కూడా సులువుగా తగ్గవచ్చు.


అరటిపండ్లు: అధిక రక్తపోటును నియంత్రించడానికి అరటిపండ్లను కూడా ఆహారంలో చేర్చుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.




