AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coconut Oil: శీతాకాలంలో చర్మ రక్షణ కోసం ఆయుర్వేదంలో 4వేలకు పైగా ఉపయోగిస్తున్న అద్భుతమైన నూనె.. ఏమిటో తెలుసా

Coconut Oil for Skin: ప్రతి స్త్రీ అందంగా ఉండాలని కోరుకుంటుంది. చర్మం ఎప్పుడూ కాంతులీనుతూ మృదువుగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. అలనాటి అందాల రాణి...

Coconut Oil: శీతాకాలంలో చర్మ రక్షణ కోసం ఆయుర్వేదంలో 4వేలకు పైగా ఉపయోగిస్తున్న అద్భుతమైన నూనె.. ఏమిటో తెలుసా
Coconut Oil Benefits
Surya Kala
|

Updated on: Oct 23, 2021 | 1:48 PM

Share

Coconut Oil for Skin: ప్రతి స్త్రీ అందంగా ఉండాలని కోరుకుంటుంది. చర్మం ఎప్పుడూ కాంతులీనుతూ మృదువుగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. అలనాటి అందాల రాణి క్లియోపాత్రా అందం, చర్మ సౌందర్యం గురించి నేటికీ మాట్లాడుతూనే ఉంటారు. ఆమె తన చర్మం కోసం పాలు, తేనె తో పాటు కొబ్బరి నూనె ను ఉపయోగించేవారట. అయితే రెండు మూడు తరాల క్రితం వరకూ చర్మం రక్షణ , ముఖ సౌందర్యం అంటూ క్రీంలు రాక ముందు వరకూ కూడా కొబ్బరి నూనెను ఉపయోగించేవారు. కొబ్బరి నూనెను ఆయుర్వేదంలో 4000 సంవత్సరాలకు పైగా ఉపయోగిస్తున్నారు. కొబ్బరి నూనె వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరి నూనె వినియోగించే వారి సంఖ్య దక్షిణ భారతదేశంలో.. ముఖ్యంగా కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే కాలక్రమంలో కొబ్బరి నూనెను పక్కకు పెట్టినా.. మళ్ళీ ఇప్పుడు కొబ్బరి నూనె చర్మానికి సహజమైన రక్షణ ఇస్తుందంటూ కొంతమంది నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా శీతాకాలంలో చర్మం పొడిబారడం వంటి సమస్యను అందరూ ఎదుర్కొంటారు. ఈ సమస్యను కొంచెం జాగ్రత్త తీసుకుని అధిగమించవచ్చు. కొబ్బరి నూనెతో అందాన్ని కాపాడుకోవచ్చు. రొజూ ఉదయాన్నే చర్మానికి కొబ్బరి నూనెతో మర్దన చేసి.. కొంచెం సేపు తర్వాత సున్ని పిండితో స్నానం చేస్తే చర్మం పొడిబార కుండా మృదువుగా కాంతులీనుతూ ఉంటుంది. చలికాలంలో రోజూ స్నానం చేసే నీటిలో కొబ్బరి నూనె , ఆలివ్ ఆయిల్ ను కొంచెం వేసుకుని స్నానం చస్తే చర్మం నిగారింపుని సొంతం చేసుకుంటుంది. కాలిన గాయలకు కొబ్బరినూనెను రాసుకుంటే మంచిది. కొబ్బరి నూనె మంచి చర్మ సంరక్షణని ఇస్తుంది. అలెర్జీ శిలీంధ్రాలను నాశనం చేస్తుంది కొబ్బరినూనె ఎండ నుంచి సంరక్షిస్తుంది. బయటికి వెళ్లే ముందుగా కొద్దిగా కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే అతినీలలోహిత కిరణాల నుంచి ముఖానికి సంరక్షణ లభిస్తుంది. కొబ్బరి నూనెను ఆయుర్వేదం వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా చర్మానికి మసాజ్‌ కోసం స్వచమైన కొబ్బరి నూనెను ఉపయోగిస్తారు. కొబ్బరి నూనె చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు , ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడం మంచి సహాయకారి. ఇక చర్మ కోసం ఉపయోగించే మాయిశ్చరైజర్‌ గా కొబ్బరి నూనె పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు మొటిమలకు కొబ్బరి నూనె మంచి ఔషధంగా చెప్పవచ్చు. మొటిమ లేని ముఖం కోసం, ముఖానికి కొబ్బరి నూనె అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పెదవులు తేమగా ఉండడం కోసం ఏదైనా లిప్ బామ్ కు కొబ్బరి నూనె కొన్ని చుక్కలను జోడించి.. దానిని పెదవులకు అప్లై చేస్తే.. మీ పెదవులు ఎల్లప్పుడూ తేమగా, మృదువుగా ఉంటాయి.