Additional Collector: సర్కారు దవాఖానాలో పురుడుపోసుకున్న కలెక్టరమ్మ.. నెట్టింట్లో ప్రశంసల వర్షం…
Additional Collector: ఇప్పటి కొంచెం సీనియర్ ప్రభుత్వ అధికారులు, వైద్యులు, కొంతమంది చదువుకున్న సీనియర్ రాజకీయ నాయకులు సర్కార్ బడులలో..
Additional Collector: ఇప్పటి కొంచెం సీనియర్ ప్రభుత్వ అధికారులు, వైద్యులు, కొంతమంది చదువుకున్న సీనియర్ రాజకీయ నాయకులు సర్కార్ బడులలో చదువుకున్నవారే.. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నవారే. అయితే కాలక్రమంలో అనేక మార్పులు వచ్చాయి. దీంతో ధన వంతులే కాదు.. సామాన్య ప్రజలు కూడా సర్కార్ బడులవైపు కానీ, ప్రభుత్వ దవాఖానా వైపు కానీ చూడడంలేదు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ప్రైవేట్ ఆస్పత్రిల వైపు చూస్తున్నారు. కానీ కొంతమంది ప్రభుత్వ అధికారులు మాత్రం ఇందుకు భిన్నం.. తాము ప్రభుత్వ వనరులను వినియోగిస్తూ ఇతరులు వినియోగించుకునేలా ఆదర్శంగా నిలుస్తున్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించడం..ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడం వంటివి చేస్తున్నారు. ఇలా అధికారులు చేయడం వలన అక్కడ సదుపాయాలు కూడా మెరుగవుతాయి. దీంతో సామాన్య ప్రజలు కూడా తిరిగి ప్రభుత్వాసుపత్రులు, స్కూల్స్ బాట పట్టే అవకాశం ఉంది. దీంతో తాజాగా ఓ కలెక్టరమ్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రభుత్వాస్పత్రిలో పురుడు పోసుకున్నారు. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ స్నేహలత పురిటి నొప్పులు రావడంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా సామాన్య మహిళలా ప్రభుత్వాసుపత్రికి వెళ్లి టెస్టులు చేయించుకున్నారు. డెలివరీ టైం అని వైద్య సిబ్బంది కలెక్టర్ స్నేహలతకు అక్కడే డెలివరీ చేశారు. స్నేహలత ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లిబిడ్డా క్షేమమని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఈ కలెక్టరమ్మ డెలివరీ న్యూస్ నేట్టింట్లో హల్ చల్ చేస్తోంది. మీరు ప్రభుత్వ ఆసుపత్రిలో పురుడుపోసుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారంటూ స్నేహలత పై ప్రశంసలు కురిపిస్తున్నారు. నీ నిర్ణయంతో ప్రభుత్వాసుపత్రుల పై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని అంటున్నారు.
Also Read: పక్కింట్లో శవం తెలియకుండానే 2 నెలలు గడిపిన మహిళ.. ఇదీ నేటి మానవుడి రిలేషన్ అంటున్న నెటిజన్లు