Union Minister Kishan Reddy: గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు.. ఎన్ని చేసినా గెలుపు మాదే: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్‌ఎస్‌ పార్టీ అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. హుజురాబాద్‌

Union Minister Kishan Reddy: గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు.. ఎన్ని చేసినా గెలుపు మాదే: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
Kishan Reddy
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 23, 2021 | 2:21 PM

Kishan Reddy – Huzurabad: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్‌ఎస్‌ పార్టీ అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో డబ్బు భారీగా ఎర వేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా గెలుపు బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు కిషన్‌రెడ్డి. హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ను ఓడించేందుకే TRS నేతలు పూర్తిగా అధికార దుర్వినియోగం చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు.

తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారికి కూడా కనీస గుర్తింపు లేదని కిషన్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. “ఇంతటి అధికార దుర్వినియోగాన్ని నేను నా రాజకీయ జీవితంలో చూడలేదు.. ఈటెలను ఓడించడానికి వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు.. బీజేపీకి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ.. కాంగ్రెస్‌తో లోపాయకార ఒప్పందం అనేది కలలో కూడా ఉండదు.” అని కిషన్ రెడ్డి అన్నారు.

అలాంటి లోపాయకార ఒప్పందాలు, సంకుచిత రాజకీయాలు కేవలంTRS పార్టీకి మాత్రమే స్వంతమని కేంద్రమంత్రి ఎద్దేవా చేశారు. మూకుమ్మడిగా కాంగ్రెస్ నేతలను ఆ పార్టీలో చేర్చుకున్న చరిత్ర TRSది అని కిషన్ రెడ్డి విమర్శించారు. అయితే, బీజేపీ నేతలు కేసీఆర్‌పై అనుచిత కామెంట్స్‌ చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే బాల్క సుమన్‌. దొంగే దొంగ అని అరవడం బీజేపీకే చెల్లుతుందని విమర్శించారు. నిన్న కిషన్‌రెడ్డి కాన్వాయ్‌పై ఎలాంటి దాడి జరగలేదని స్పష్టం చేశారాయన.

Read also: Vallabhaneni Vamsi: దమ్ముంటే సారథ్యం వహించి లోకేష్‌ను గెలిపించుకోండి.. పరిటాల సునీతకు వల్లభనేని వంశీ ఛాలెంజ్

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..