Weird News: పక్కింట్లో శవం తెలియకుండానే 2 నెలలు గడిపిన మహిళ.. ఇదీ నేటి మానవుడి రిలేషన్ అంటున్న నెటిజన్లు
Weird News: కోవిడ్ 19 మనిషి జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ముఖ్యంగా గత ఏడాది ప్రపంచ దేశాలను ఓ రేంజ్ లో కరోనా వణికించింది. కరోనా కట్టడి..
Weird News: కోవిడ్ 19 మనిషి జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ముఖ్యంగా గత ఏడాది ప్రపంచ దేశాలను ఓ రేంజ్ లో కరోనా వణికించింది. కరోనా కట్టడి కోసం అనేక దేశాలు లాక్ డౌన్ విధించాయి. ప్రజలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. అమెరికాలో కూడా కరోనా ఉధృతి పెరిగినప్పుడు ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. అప్పుడు ఓ మహిళకు వింత ఎదురైంది. ఆమెకు తనకు తెలియకుండానే సుమారు 8 వారాల పాటు ఓ శవానికి అతి దగ్గరగా నిద్రించింది. అయితే తాను శవం దగ్గర నిద్రపోతున్నాను అన్న విషయం ఆ యువతికి తెలియకపోవడం ఇక్కడ ఉన్న ట్విస్ట్.. అసలేం జరిగిందో వివరాల్లోకి వెళ్తే..
అమెరికాలో లాస్ ఏంజెల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో రిగాన్ బెల్లీ అనే మహిళ ఒంటరిగా నివసిస్తోంది. అయితే ఒకరోజు అపార్ట్‌మెంట్‌లో భరించలేనంత దారుణంగా దుర్వాసన రావడం ప్రారంభించింది. అలా వస్తున్న స్మెల్ కు రిగాన్ కు తలనొప్పి రావడం మొదలైంది. ఇక రాత్రి నిద్రపట్టక ఆరోగ్యం కూడా పాడైపోయిందట. అంతేకాదు.. అపార్ట్ మెంట్ లో పురుగులు, సాలెపురుగులు పెరిగిపోయాయి. దీంతో రిగాన్ అపార్ట్‌మెంట్ మేనేజర్‌కి కంప్లైంట్ చేసింది. తనకు ఎక్కడ నుంచో కుళ్ళిన వాసన వస్తుందని చెప్పింది. దీంతో మేనేజర్ అపార్ట్‌మెంట్ బ్లాక్‌ను వెదకడం మొదలు పెట్టారు. అప్పుడు రిగాన్ పక్క అపార్ట్‌మెంట్ నుంచి విపరీతమైన దుర్వాసన వస్తున్న విషయం గుర్తించారు.
ఆ స్మెల్ కు అపార్ట్ మెంట్ దగ్గరకు కూడా వెళ్లలేకపోయారు. అతి కష్టం మీద అపార్ట్మెంట్ దగ్గరకు వెళ్లి.. మాస్టర్ కీతో ఇంటి తలుపు ఓపెన్ చేశారు. వెంటనే భరించలేనంత దారుణమైన వాసన రావడమే కాదు.. అక్కడ కనిపించిన దృశ్యం తో అక్కడ ఉన్నవారు షాక్ తిన్నారు. నేల మీద అస్థిపంజరంగా మారిన శవం కనిపించింది. అంతేకాదు ఆ అస్థిపంజరం రిగాన్ ప్లాట్ కు కేవలం మూడు అడుగుల దూరంలో ఉంది. తన రూమ్ లో చాలా రోజులు నిద్రపోయానని.. అయితే ఎప్పుడు కూడా తనకు సమీపంలో శవం ఉందని ఆలోచించలేదని.. వాసన వస్తున్నా ఏ కుక్క చనిపోయి ఉంటుందని భావించా అంతేకానీ.. ఒక మనిషి మరణించి ఉంటారని అనుకోలేదంటు షాకింగ్ కామెంట్స్ చేసింది రిగాన్. తనకు ఎదురైన అనుభవాన్ని రిగాన్ బెల్లీ టిక్‌టాక్ ద్వారా షేర్ చేసింది.
ఈ విషయం పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. రోజు రోజుకీ మనిషి మనిషి మధ్య పెరుగుతున్న దూరానికి ఇదొక ఉదాహరణ అని అంటున్నారు. కనీసం తమ పక్కన ఉంటున్నవారు ఎవరో కూడా తెలియకుండా తమ లోకంలో తామే ఎవరికీ ఎవరూ తెలియకుండా బతుకుతున్నారు. ఇక కరోనా వచ్చిన తర్వాత మనిషి మనిషి మధ్య మరింత దూరం పెంచిందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అందుకనే రిగాన్ తన అపార్ట్‌మెంట్‌లో ఉండే వ్యక్తి మరణించి రెండు నెలలైనా గుర్తించలేదు.. ఆమె కాదు అసలు అపార్ట్ మెంట్ లో ఎవరూ ఆ మనిషి ఏమయ్యాడు.. కనిపించడం లెదు అని అలోచించకపోవడం నేటి పరిస్థితిని తెలియజేస్తుందని అంటున్నారు.
Also Read: నాకు అన్నీ తెలుసు.. నీకు ఏమి చెప్పను అంటున్న విక్రమాదిత్య.. టీజర్ అదుర్స్ అంటున్న ఫ్యాన్స్..