Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radheshyam Teaser: నాకు అన్నీ తెలుసు.. నీకు ఏమి చెప్పను అంటున్న విక్రమాదిత్య.. టీజర్ అదుర్స్ అంటున్న ఫ్యాన్స్

Prabhas Radhe ShyamTeaser: డార్లింగ్ ,యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు కానుకగా 'రాధే శ్యామ్' చిత్ర యూనిట్ టీజర్ ను రిలీజ్ చేసింది. మోస్ట్ అవైటెడ్ మూవీ...

Radheshyam Teaser: నాకు అన్నీ తెలుసు.. నీకు ఏమి చెప్పను అంటున్న విక్రమాదిత్య.. టీజర్ అదుర్స్ అంటున్న ఫ్యాన్స్
Radhe Shyam
Follow us
Surya Kala

|

Updated on: Oct 23, 2021 | 12:01 PM

Prabhas Radhe Shyam Teaser: డార్లింగ్ ,యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు కానుకగా ‘రాధే శ్యామ్’ చిత్ర యూనిట్ టీజర్ ను రిలీజ్ చేసింది. మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రాధే శ్యామ్’ లోని విక్రమాదిత్యని ప్రేక్షకులకు పరిచయం చేసింది. నువ్వు ఎవరో నాకు తెలుసు కానీ నీకు చెప్పను, ప్రేమలో నీ మనసు ఎప్పుడు విరిగిపోతుందో నాకు తెలుసు కానీ నీకు చెప్పను, నీ చావు నాకు తెలుసు కానీ నీకు చెప్పను, నాకు అన్నీ తెలుసు కానీ నీకు చెప్పను, చెప్పినా మీ ఆలోచనలకి అందదు అంటూ విక్రమాదిత్య పాత్రకు ఫ్యాన్స్ పరిచయం చేసింది.. అంతేకాదు నా పేరు విక్రమాదిత్య. నేను దేవుని కాదు మీలో ఒక్కడిని కూడా కాదు. జ్యోతిష్యుడు విక్రమాదిత్య అంటూ ప్రభాస్ బ్లాక్ డ్రస్ లో స్తైలిస్ లుక్ లో కనిపించారు గ్లోబల్ ప్రభాస్ డే అంటూ హ్యాష్ ట్యాగ్ తో ఈరోజు డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజుని అభిమానులు జరుపుకుంటున్నారు.

2022 జనవరి 14 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమాలో ప్రభాస్, పూజా హెడ్గేలు జోడీగా నటించారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. దీంతో టీజర్‌ను ఇంగ్లీష్ తో పాటు బహు భాషల్లో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ రంగం సిద్ధం చేసింది. జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరక్కుతున్న ఈ సినిమనుగోపికృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్, టి-సిరీస్ బ్యానర్‌ లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. అంతేకాదు ప్రభాస్ పాన్ ఇండియా మూవీస్ ను చేస్తూ.. బిజిబిజిగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ ప్రస్తుతం సలార్, ఆదిపురుష్, సినిమాలతోపాటు నాగ్ అశ్విన్, సందీప్ వంగ స్పిరిట్ సినిమాలను చేస్తున్నారు.

Also Read:  వివాదంగా మారిన రహదారి.. పోలీసుల సాయంతో పొలం దున్నుతున్న వీడియో వైరల్..

Happy Birthday Prabhas: నేడు డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు.. సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఫ్యాన్స్..