Hajj 2022: కేంద్రం కీలక నిర్ణయం.. వారికి మాత్రమే హజ్ యాత్రకు పర్మిషన్.. పూర్తి వివరాలు..
Mukhtar Abbas Naqvi - Hajj 2022: కరోనావైరస్ కారణంగా గతేడాది నుంచి హజ్ యాత్ర రద్దయిన విషయం తెలిసిందే. అయితే.. హజ్ 2022 యాత్రకు నవంబర్ నుంచి
Mukhtar Abbas Naqvi – Hajj 2022: కరోనావైరస్ కారణంగా గతేడాది నుంచి హజ్ యాత్ర రద్దయిన విషయం తెలిసిందే. అయితే.. హజ్ 2022 యాత్రకు నవంబర్ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ వెల్లడించారు. కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారినే ఈసారి హజ్ యాత్రకు ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. కోవిడ్ -19 మార్గదర్శకాలకు అనుగుణంగా యాత్ర ఉంటుందని నఖ్వీ తెలిపారు. వచ్చే ఏడాది హజ్ యాత్ర కోసం నవంబర్ మొదటి వారంలో అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు. హజ్ యాత్రికుల ఎంపిక ప్రమాణాలను భారత్, సౌదీ ప్రభుత్వాలు నిర్ణయిస్తాయని నఖ్వీ తెలిపారు. న్యూఢిల్లీలో హజ్ యాత్ర 2022 సమీక్షా సమావేశం శుక్రవారం కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా నఖ్వీ మాట్లాడుతూ.. కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్న వారినే ఈసారి హజ్ యాత్రకు ఎంపిక చేయనున్నట్లు స్పష్టంచేశారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభమవుతుందని.. పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో ఉంటుందని తెలిపారు. ఈసారి హజ్ యాత్రికులకు డిజిటల్ హెల్త్ కార్డు (E-MASIHA) ఈ-మసీహ ద్వారా వైద్య సౌకర్యం అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
Entire #Haj2022 process in India will be 100 % digital. Arrangements for special training for Haj 2022 regarding Corona protocols & Health and Hygiene are being made in India and Saudi Arabia for Haj pilgrims. pic.twitter.com/uj1RYY3fzT
— Mukhtar Abbas Naqvi (@naqvimukhtar) October 22, 2021
మెహ్రామ్ కేటగిరీ (మగతోడు లేకుండా మక్కా యాత్రకు వెళ్లే మహిళలు) లో దరఖాస్తు చేసుకున్న 3000 మందికి పైగా మహిళలకు వచ్చే ఏడాది హజ్ యాత్రకు అనుమతించనున్నట్లు నఖ్వీ తెలిపారు. మెహ్రామ్ కేటగిరీలో ఉన్న మహిళలందరికీ లాటరీ నుంచి మినహాయింపు లభిస్తుంది.
Also Read: