AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bathukamma: విశ్వవేదికపై బతుకమ్మ ఖ్యాతి.. నేడు బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ పాట ప్రదర్శన.. వివరాలివే..

Burj Khalifa - Bathukamma : తెలంగాణ పూల పండుగ బతుకమ్మ.. ఖ్యాతిని ఈ రోజు విశ్వ వేదికపై ప్రదర్శించనున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో శనివారం

Bathukamma: విశ్వవేదికపై బతుకమ్మ ఖ్యాతి.. నేడు బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ పాట ప్రదర్శన.. వివరాలివే..
Bathukamma
Shaik Madar Saheb
|

Updated on: Oct 23, 2021 | 9:18 AM

Share

Burj Khalifa – Bathukamma : తెలంగాణ పూల పండుగ బతుకమ్మ.. ఖ్యాతిని ఈ రోజు విశ్వ వేదికపై ప్రదర్శించనున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో శనివారం రాత్రి ప్రపంచంలోని ఎత్తైన భవనం దుబాయ్‌లోని బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ పాటను ప్రదర్శించనున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బూర్జ్ ఖలీఫా మీద బతుకమ్మను ప్రదర్శించబోయే తెర (స్క్రీన్) ప్రపంచంలోనే అతి పెద్దది. ఒకేసారి దేశవిదేశాలకు చెందిన లక్ష మంది బుర్జ్ ఖలీఫా స్క్రీన్‌పై బతుకమ్మను వీక్షించనున్నారు. రాత్రి 9.40 నిమిషాలకు, 10.40 నిమిషాలకు బూర్జ్ ఖలీఫాపై మూడు నిమిషాల బతుకమ్మ వీడియోను ప్రదర్శించనున్నారు. దీనిలో బతుకమ్మ ప్రాశస్త్యం, విశిష్టత, సంబురాల సంస్కృతిని తెలియజేయనున్నారు. ఈ వీడియోలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటాన్ని సైతం ప్రదర్శించనున్నారు.

బతుకమ్మ పండుగ ద్వారా మన సాంస్కృతి, ఖ్యాతిని ప్రపంచమంతటా చాటి చెప్పేందుకు ఎమ్మెల్సీ కవిత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం కోసం కవిత ఇప్పటికే దుబాయ్‌ చేరుకున్నారు. బతుకమ్మ పండుగ ఖ్యాతిని ప్రపంచమంతటా చాటి చెప్పేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు కవిత తెలిపారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అమర్చిన ఎల్‌ఈడీ తెరలపై రెండు సార్లు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవితతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, జాగృతి నాయకులు, ప్రవాస తెలంగాణ వాసులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు సైతం ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు జాగృతి నాయకులు తెలిపారు.

Also Read:

JP Nadda: ఆ ఘనత మనకే సొంతం.. 100 కోట్ల వ్యాక్సినేషన్‌పై జేపీ నడ్డా కీలక వ్యాసం..

Telangana: లేగదూడ విషయంలో తలెత్తిన గొడవ.. పొట్టు.. పొట్టు కొట్టుకున్నారు..

Follow Us
హిట్ మ్యాన్ రికార్డు బద్ధలు.. ధోనీ రికార్డుపై కన్నేసిన అభిషేక్
హిట్ మ్యాన్ రికార్డు బద్ధలు.. ధోనీ రికార్డుపై కన్నేసిన అభిషేక్
కైలాస మానస సరోవర్ యాత్రకు వెళతారా..? అప్లై చేయడానికి చివరి తేదీ..
కైలాస మానస సరోవర్ యాత్రకు వెళతారా..? అప్లై చేయడానికి చివరి తేదీ..
టాలీవుడ్‌లో తిరుగులేని నటుడు.. ఆయన భార్య కూడా
టాలీవుడ్‌లో తిరుగులేని నటుడు.. ఆయన భార్య కూడా
2 రోజుల్లోనే EAPCET ఇంజనీరింగ్ పరీక్షలు.. ఒక్క నిమిషం నిబంధన అమలు
2 రోజుల్లోనే EAPCET ఇంజనీరింగ్ పరీక్షలు.. ఒక్క నిమిషం నిబంధన అమలు
ఇంతకీ.. ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ..?
ఇంతకీ.. ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ..?
భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టే కూరగాయ మొక్కలు ఇవేనా?
భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టే కూరగాయ మొక్కలు ఇవేనా?
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భార్య ఏం బిజినెస్ చేస్తుందో తెలుసా?
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భార్య ఏం బిజినెస్ చేస్తుందో తెలుసా?
ఐపీఎల్‎లో అరుదైన రికార్డ్ సృష్టించబోతున్న స్వింగ్ కింగ్
ఐపీఎల్‎లో అరుదైన రికార్డ్ సృష్టించబోతున్న స్వింగ్ కింగ్
సింగరకొండ ఆంజనేయుడు.. గుమ్మం దగ్గరే 99 అడుగుల మహావిగ్రహం! వాహన...
సింగరకొండ ఆంజనేయుడు.. గుమ్మం దగ్గరే 99 అడుగుల మహావిగ్రహం! వాహన...
మల్లెచెట్టు చిన్నదైనా కొమ్మకొమ్మకి విపరీతంగా పూలు పూయాలంటే
మల్లెచెట్టు చిన్నదైనా కొమ్మకొమ్మకి విపరీతంగా పూలు పూయాలంటే