Railway Jobs: రైల్వేలో 1664 పోస్టులకు నోటిఫికేషన్.. ఎలాంటి రాత పరీక్ష లేదు.. ఆ మార్కుల ఆధారంగానే ఎంపిక..!
Railway Recruitment 2021: ప్రస్తుతం కరోనా మహహ్మారి తగ్గుముఖం పట్టడంతో ఆయా రంగాలలో ఉద్యోగ అవకాశాలు వెలువడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఎన్నో ఉద్యోగ..
Railway Recruitment 2021: ప్రస్తుతం కరోనా మహహ్మారి తగ్గుముఖం పట్టడంతో ఆయా రంగాలలో ఉద్యోగ అవకాశాలు వెలువడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఎన్నో ఉద్యోగ నోటిఫికేన్స్ విడుదలవుతున్నాయి. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తుండటంతో నిరుద్యోగులకు ఇది మంచి అవకాశమనే చెప్పాలి. ఇక తాజాగా రైల్వేలో కూడా రోజురోజుకు ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇక తాజాగా ప్రయాగ్‌రాజ్ ప్రధాన కేంద్రంగా ఉన్న రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్‌ఆర్‌సీ).. నార్త్ సెంట్రల్ రైల్వే(ఎన్‌సీఆర్)కు చెందిన వివిధ విభాగాలలో అప్రెంటిస్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడులైంది. ఖాళీగా ఉన్న పోస్టులకు నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1664 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులు ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, మెకానిక్ తదితర ట్రేడుల్లో ఉన్నాయి.
విద్యార్హతలు..
ఈ పోస్టులకు పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వీటికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. దరఖాస్తులను సమర్పించేందుకు చివరి తేదీ డిసెంబర్ 1, అభ్యర్థులు పూర్తి వివరాలను https://www.rrcpryj.org/ వెబ్‌సైట్ చూసి వివరాలు తెలుసుకోవచ్చు.
► మొత్తం ఖాళీల సంఖ్య: 1664
► ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, మెకానిక్ తదితరాలు.
► అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ) ఉత్తీర్ణులవ్వాలి.
► వయసు: 01.12.2021 నాటికి 15–24 ఏళ్ల మధ్య ఉండాలి.
► ఎంపిక విధానం: పదో తరగతి,ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారానే
► దరఖాస్తులు ప్రారంభ తేది: నవంబర్ 02, 2021
► దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 01, 2021
► వెబ్‌సైట్: https://www.rrcpryj.org/