AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS EAMCET 2021: తెలంగాణ ఎంసెట్ తుది విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తివివరాలివే..

TS EAMCET 2021: తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ 2021కు సంబంధించి ఇంజినీరింగ్ విభాగానికి తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదలైంది. ఈ షెడ్యూల్‌ను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ విడుదలచేసింది.

TS EAMCET 2021: తెలంగాణ ఎంసెట్ తుది విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తివివరాలివే..
Ts Eamcet 2021
Shiva Prajapati
|

Updated on: Oct 23, 2021 | 6:03 AM

Share

TS EAMCET 2021: తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ 2021కు సంబంధించి ఇంజినీరింగ్ విభాగానికి తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదలైంది. ఈ షెడ్యూల్‌ను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ విడుదలచేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం.. అభ్యర్థులు ఈ నెల 25, 26వ తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలనలకు స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. 27వ తేదీన ఎంసెట్ ఇంజినీరింగ్ ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఈ నెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చు. కాగా, వచ్చే నెల 2వ తేదీన తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ సదరు ప్రకటనలో వెల్లడించారు. ఇదిలాఉంటే.. తొలి విడతలో అలాట్ చేసుకున్న సీట్లను రద్దు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. తొలి విడతలో భాగంగా అలాట్ అయిన సీట్లను రద్దు చేసుకోవాలంటే అభ్యర్థులు 28వ తేదీలోగా అప్లై చేసుకోవాలని సూచించారు. ఆ తరువాత సీట్ క్యాన్సిల్ చేసుకోవడానికి అవకాశం లేదని స్పష్టం చేశారు.

ఇదిలాఉంటే.. నవంబర్ 9వ తేదీన ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు. నవంబర్ 9వ, 10వ తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల నమోదు ఉంటుందన్నారు. నవంబర్ 12వ తేదీన ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ జరుగుతుందని, 14న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదలవుతాయని ఈ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

Also read:

Wife and Husband: మరో మహిళతో భర్త అక్రమ సంబంధం.. అది చూసిన భార్య చితిక్కొట్టుడు కొట్టిందంతే..

Huzurabad Bypoll: ఇదేం దుర్మార్గం.. దళితులను కొట్టిది మీరే.. కేసులు పెట్టేది మీరే.. బీజేపీ నేతలపై ఫైర్ అయిన టీఆర్ఎస్ ముఖ్యనేత..

TDP vs YCP: ‘బరువు తగ్గమంటే బుర్ర తగ్గించుకున్నాడు’.. నారా లోకేష్‌పై విజయసాయి సెటైర్ల వర్షం..