Huzurabad Bypoll: ఇదేం దుర్మార్గం.. దళితులను కొట్టిది మీరే.. కేసులు పెట్టేది మీరే.. బీజేపీ నేతలపై ఫైర్ అయిన టీఆర్ఎస్ ముఖ్యనేత..

Huzurabad Bypoll: హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కొద్ది ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయం రసవత్తరంగా మారుతోంది. రెండు పార్టీలకు చెందిన

Huzurabad Bypoll: ఇదేం దుర్మార్గం.. దళితులను కొట్టిది మీరే.. కేసులు పెట్టేది మీరే.. బీజేపీ నేతలపై ఫైర్ అయిన టీఆర్ఎస్ ముఖ్యనేత..
Palla Rajeshwar Reddy
Follow us

|

Updated on: Oct 23, 2021 | 5:52 AM

Huzurabad Bypoll: హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కొద్ది ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయం రసవత్తరంగా మారుతోంది. రెండు పార్టీలకు చెందిన నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో చోటు చేసుకున్న ఘర్షణ.. రాజకీయ ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనపై టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ నేతల తీరుపై నిప్పులు చెరిగారు. రెచ్చగొట్టి, దాడులు చేసి.. ఆపై రివర్స్ కేసులు బనాయిస్తున్నారంటూ బీజేపీ నేతలపై పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. శుక్రవారం నాడు సాయంత్రం సమయంలో ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీనిపై స్పందించిన పల్లా.. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో చొరబడి తమ పార్టీ కార్యకర్తలపై బీజేపీ శ్రేణులు దాడి చేశారని అన్నారు. బీజేపీ శ్రేణులు కేసీఆర్‌పై దుర్భాషలాడటాన్ని టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కార్యాలయం ముందు నుంచి వెళ్తున్న బీజేపీ అభ్యర్థి తమ కార్యకర్తలతో రెచ్చగొట్టే నినాదాలు చేయించారని పల్లా ఆరోపించారు. అయినప్పటికీ తమ పార్టీ కార్యకర్తలు సంయమనంతో ఉన్నారన్నారు. కానీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ కలిసి బీజేపీ కార్యకర్తలను రెచ్చగొట్టి టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు ఉసిగొల్పారని పల్లా ఆరోపించారు. పైగా రివర్స్ కేసులు బనాయించి ‘దొంగే దొంగా దొంగా’ అన్న చందంగా వ్యవహరించారని నిప్పులు చెరిగారు.

బీజేపీ నేతలు దళిత కాలనీకి వెళ్లి దళితులను వారి ర్యాలీలో పాల్గొనాల్సిందిగా కోరారని, అయితే వారు నిరాకరించడంతో దళిత ఎంపీటీసీ చినరాయుడు, దళిత కార్యకర్తలపై బీజేపీ శ్రేణులు దాడి చేశారని పల్లా పేర్కొన్నారు. దళితులపై బీజేపీ శ్రేణులు జరిపిన దాడులను టీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని పల్లా స్పష్టం చేశారు. నాలుగు రోజుల క్రితం కమలాపూర్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మిత్రుడు విశ్వనాథ్ యాక్సిడెంట్ చేసి ఒక ఆటో డ్రైవర్ ను పొట్టన పెట్టుకున్న కేసులో ఈటల రాజేందర్, బీజేపీ నాయకులు అసలు విషయాలను వక్రీకరించి టీఆర్ఎస్ విప్ బాల్క సుమన్ పై దుష్ప్రచారం చేసి అబాసుపాలు అయ్యారన్నారు. ఈ సంఘటనలో కూడా బలవంతంగా తీసుకొచ్చిన జనం వారి ప్రసంగం వినకుండానే తిరిగి వెళ్లిపోవడం బీజేపీ నాయకులకు మింగుడు పడలేదన్నారు. చివరకు వారే దాడి చేసి వారే కేసులు బనాయించడం బీజేపీ నేతలకు పరిపాటిగా మారిందని విమర్శించారు. దళితులపై, టీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ శ్రేణుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పల్లా తెలిపారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మరని, హుజూరాబాద్‌లో బీజేపీకి ఓటమి తప్పదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చే వారం రోజుల పాటు జాగ్రత్తగా ఉంటూ.. వారి కుట్రలను కనిపెట్టి సంయమనంతో ఉండాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి శారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

Also read:

Viral News: దేశ ప్రజలందరికీ రూ.4 వేల సాయం.. కేంద్రం ఇలాంటి ప్రకటన చేసిందా?.. నిజానిజాలేంటో ఇక్కడ తెలుసుకోండి..

Viral Video: ‘‘ఏడవకురా.. ఏప్రిల్‌లో వెళ్లిపోతాం లే’’.. హాస్టల్‌లో చిన్నారిని ఓదార్చిన మరో చిన్నారి!

Aliens in Sea: సముద్ర గర్భంలో ఏలియన్స్ రూపాలు.. అవి చూసి అవాక్కయిన శాస్త్రవేత్తలు..