Wife and Husband: మరో మహిళతో భర్త అక్రమ సంబంధం.. అది చూసిన భార్య చితిక్కొట్టుడు కొట్టిందంతే..

Wife and Husband: తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆ ఇల్లాలి కోపం నషాళానికి ఎక్కింది. ఇంకేముంది భద్రకాళిలా మారింది. తన భర్త అక్రమ సంబంధం నెరపుతున్న

Wife and Husband: మరో మహిళతో భర్త అక్రమ సంబంధం.. అది చూసిన భార్య చితిక్కొట్టుడు కొట్టిందంతే..
Woman
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 23, 2021 | 5:55 AM

Wife and Husband: తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆ ఇల్లాలి కోపం నషాళానికి ఎక్కింది. ఇంకేముంది భద్రకాళిలా మారింది. తన భర్త అక్రమ సంబంధం నెరపుతున్న మహిళ ఇంటికి వెళ్లి ఆమెను చితక్కొట్టుడు కొట్టింది. తన భర్తతో అక్రమ సంబంధం ఎందుకు పెట్టుకున్నావంటూ నడిరోడ్డుపైకి ఈడ్చుకొచ్చి పొట్టుపొట్టుగా కొట్టింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. సుల్తానాబాద్ ప్రభుత్వ టీబీ ఆస్పత్రిలో అటెండర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌కు పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. అయితే, కొంతకాలంగా తాను పనిచేస్తున్న ఆస్పత్రిలోనే పని చేస్తున్న మరో మహిళతో శ్రీనివాస్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ భార్య.. కొంతకాలంగా వారిస్తూ వచ్చింది. అయినప్పటికీ మార్పు రాకపోగా కుటుంబాన్ని పట్టించుకోవడమే మానేశాడు.

దీంతో ఆగ్రహించిన శ్రీనివాస్ భార్య.. ఇవాళ నేరుగా తన భర్తతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న మహిళ ఇంటికి వెళ్లింది. తన భర్తతో ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకున్నావంటూ ఆమెను నిలదీసింది. అదే ఆగ్రహంలో ఆమెను చితక బాదింది. నడిరోడ్డుపైకి ఈడ్చుకొచ్చి చెప్పుతొ కొట్టింది. తన భర్త శ్రీనివాస్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భార్య ఆరోపించింది. మూడు సంవత్సరాలుగా ఆమెతో శారీరక సంబంధం కొనసాగిస్తూ తమను పట్టించుకోవడమే మానేశాడంటూ తన పిల్లలతో కలిసి బోరున విలపించింది. కాగా, ఈ ఘర్షణ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని ఇరువురు మహిళలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ వ్యవహారంలో ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు.

Also read:

Huzurabad Bypoll: ఇదేం దుర్మార్గం.. దళితులను కొట్టిది మీరే.. కేసులు పెట్టేది మీరే.. బీజేపీ నేతలపై ఫైర్ అయిన టీఆర్ఎస్ ముఖ్యనేత..

TDP vs YCP: ‘బరువు తగ్గమంటే బుర్ర తగ్గించుకున్నాడు’.. నారా లోకేష్‌పై విజయసాయి సెటైర్ల వర్షం..

Huzurabad Bypoll: సీఎం డైరెక్షన్‌లోనే కేంద్ర మంత్రిపై దాడికి యత్నం.. టీఆర్ఎస్‌పై మండిపడిన బండి సంజయ్..

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..