Intrusting Video: వందేళ్లయినా.. ఈమెకు వృద్ధాప్యం రాదు.. ఎందుకో తెలుసా.. (వీడియో )

ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి చాలా బాగుంది కదూ.. 22 ఏళ్ల ఈ అమ్మాయి ఇప్పుడు కోట్లలో సంపాదిస్తుంది. 'ఓహ్‌ రోజీ' ఈమె పేరు. ఈమె సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్‌ కూడా.

Anil kumar poka

|

Oct 24, 2021 | 7:57 AM

ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి చాలా బాగుంది కదూ.. 22 ఏళ్ల ఈ అమ్మాయి ఇప్పుడు కోట్లలో సంపాదిస్తుంది. ‘ఓహ్‌ రోజీ’ ఈమె పేరు. ఈమె సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్‌ కూడా. యోగా, జాగింగ్‌ ఇంకా తన ఏక్టివిటీస్‌కి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో పంచుకుంటూ భారీగానే ఫాలోవర్స్‌ని తన ఖాతాలో వేసుకుంది. తన అందం, అభినయంతో ఎన్నో యాడ్స్‌లో నటించే అవకాశం దక్కించుకుంది. దాంతో కోట్లు సంపాదిస్తోంది. అయితే ఈ అమ్మాయి గురించి ఒక షాకింగ్‌ విషయం మీకు చెప్పాలి. అదేంటంటే..

ఈ అమ్మాయిని సరిగ్గా చూడండి. ఆసియన్‌- కొరియన్‌ పోలికలతో చాలా బాగుంది కదూ! సిడస్‌ స్టూడియో ఎక్స్‌ అనే సంస్థ ఈమెను తయారు చేసింది. తయారు చెయ్యడమేంటి అనుకుంటున్నారా.. అవును.. ఈమె నిజమైన అమ్మాయి కాదు.. వర్చువల్‌. మొదట అందరూ అమ్మాయి అనుకున్నారు.. తర్వాత విషయం తెలిసి షాకయ్యారు. మనిషి కాదంటే నమ్మలేనంత సహజంగా ఉంటాయి మరి ఆమె ఫొటోలు ! అత్యాధునిక పరిజ్ఞానంతోనే నేటి తరానికి తగ్గట్టుగా ఉండేలా ఈ అమ్మాయిని రూపొందించారు. ఇందుకు 3డి మోడలింగ్‌ టెక్నాలజీ ద్వారా 800కుపైగా ముఖ, శరీర కదలికలను సేకరించారట. మొదట ఈమె ఫొటోలను సోషల్‌ మీడియాలో పెట్టినప్పుడు అందరూ చాలా అందంగా ఉందని వేలల్లో లైకులు కొట్టారు. దాంతో యాడ్‌లూ ప్రారంభించారు. ఆ తర్వాతే అసలు విషయాన్ని చెప్పారు. ఈ ఏడాది ఈమె సంపాదన ఎంతో తెలుసా? ఒక బిలియన్‌ కొరియన్‌ వాన్‌ అంటే మన రూపాయల్లో ఆరు కోట్లకు పైమాటే అన్నమాట. రోజీ తన తయారీకి మించి లాభాలూ తెచ్చి పెడుతోంది.

ఫొటోలకు పోజులివ్వడం, వీడియోకు అనుగుణంగా కదలడం వంటివన్నీ చేస్తుందట. అయితే వీటికే పరిమితం కాకుండా ఈమెకో ప్రత్యేకమైన గొంతుకను కల్పించి, సినిమాల్లోకీ ప్రవేశపెతా మంటున్నారు రూపకర్తలు. రోజీకి వయసై పోదు, అలిసిపోదు, వివాదాల ప్రస్తావనే ఉండదు… కాబట్టి నిర్మాతలు కూడా ఆమెతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఒక కొరియన్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ కోసం ఈమె నటించిన యాడ్‌ను యూట్యూబ్‌లో పెడితే కోటిమందికి పైగా వీక్షించారు. క్రియేటివిటీలో యువతకు సోషల్‌ మీడియాలోనూ పోటీ తప్పదేమో! 
మరిన్ని చదవండి ఇక్కడ : Viral Video: మొసలి భారీ నుండి బిడ్డ ప్రాణాలకు తల్లి ప్రాణం అడ్డు.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..(వీడియో)

 Eiffel Tower video: ఈఫిల్ టవర్‌ను ఫోటో తీయకూడదా..? ఎందుకో తెలుసా..?(వీడియో)

 పవన్ కళ్యాణ్ పారితోషికంపై పోసాని సంచలన కామెంట్స్| Posani Vs Pawan Kalyan

 Floods in Edupayalo video: మళ్ళీ మునిగిన ఏడుపాయల గుడి.. భారీ వర్షాలు ఎంత పని చేసాయి..(వీడియో)

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu