Viral Video: మొసలి భారీ నుండి బిడ్డ ప్రాణాలకు తల్లి ప్రాణం అడ్డు.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..(వీడియో)
ప్రపంచంలోని ప్రతి తల్లి తన బిడ్డను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. బిడ్డకు ఏదైనా ఆపద వస్తే విలవిల్లాడిపోతుంది. ఏ జీవి అయినా ఇందుకు మినహాయింపు కాదు. జంతువులు కూడా తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రపంచంలోని ప్రతి తల్లి తన బిడ్డను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. బిడ్డకు ఏదైనా ఆపద వస్తే విలవిల్లాడిపోతుంది. ఏ జీవి అయినా ఇందుకు మినహాయింపు కాదు. జంతువులు కూడా తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారి కళ్లు చెమర్చక మానవు.
కొన్ని జింకలు అప్పటి వరకూ ఎక్కడెక్కడో మేత మేసి, తిరిగి తమ స్థావరానికి వెళ్తూ ఓ చెరువును దాటుతున్నాయి. ఇంతలో ఓ జింక పిల్ల వాటి గుంపునుంచి విడిపోయింది. ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ ఆ చెరువులో ఈదుకుంటూ వెళ్తున్న జింకపిల్ల ఓ మొసలి కంట్లో పడింది. ఇంకేముంది జింకపిల్లను ఆరగించేందుకు దానివైపు వస్తుంది. ఇంతలో తన బిడ్డ ప్రమాదంలో ఉందని గ్రహించిన తల్లి జింక వాయువేగంతో వచ్చింది. తన బిడ్డ ప్రాణాలకు తన ప్రాణం అడ్డువేసింది. ఆ మొసలి బారినుంచి బిడ్డను కాపాడి తను ఎరగా మారింది. మొసలి ఆ తల్లి జింకను అమాంతం పట్టి నీటిలోకి లాక్కెల్లిపోయింది. తల్లి చనిపోయినా, బిడ్డ సురక్షితంగా బయటపడింది. దాంతో తల్లిని కోల్పోయిన ఆ జింకపిల్ల ఒంటరిగా వెళ్లిపోయింది. సోషల్ మీడియాలో వైరల్‌గామారిన ఈ వీడియోను నెటిజన్లు తెగ లైక్ చేస్తున్నారు. జింక తల్లి ప్రేమకు ఫిదా అవుతున్నారు. నిజంగా తల్లి ప్రేమకు ఎవరూ సాటిరారని కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Eiffel Tower video: ఈఫిల్ టవర్‌ను ఫోటో తీయకూడదా..? ఎందుకో తెలుసా..?(వీడియో)
పవన్ కళ్యాణ్ పారితోషికంపై పోసాని సంచలన కామెంట్స్| Posani Vs Pawan Kalyan
Floods in Edupayalo video: మళ్ళీ మునిగిన ఏడుపాయల గుడి.. భారీ వర్షాలు ఎంత పని చేసాయి..(వీడియో)
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??

