Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: డ్రైవర్ లేకుండానే దూసుకెళ్లిన ఆటో.. వీడియో చూస్తే అవాక్కవుతారు

రోడ్డు మీద డ్రైవర్ లేకుండా నడిచే వాహనాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? మన ఇండియాలో అయితే ఇంకా అలాంటి టెక్నాలజీ రాలేదు.

Viral Video: డ్రైవర్ లేకుండానే దూసుకెళ్లిన ఆటో.. వీడియో చూస్తే అవాక్కవుతారు
Auto Running Without Driver
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 29, 2021 | 8:32 AM

రోడ్డు మీద డ్రైవర్ లేకుండా నడిచే వాహనాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? మన ఇండియాలో అయితే ఇంకా అలాంటి టెక్నాలజీ రాలేదు. అయితే డ్రైవర్ లేకుండా ఆటో రన్ అవ్వడాన్ని మేము ఇప్పుడు చూపించబోతున్నాం. అవును తాజాగా, అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదేం సినిమా స్టోరీ కాదండోయ్. పూర్తిగా నిజం. మధ్యప్రదేశ్‌లోని శివపురిలో ఈ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది.  ఆటో ఆటోమేటిక్‌గా కదలడం మీరు వీడియోలో చూడవచ్చు.

ఒక ఆటో ప్రమాదశాత్తూ కింద పడిపోయింది. దీంతో వెంటనే డ్రైవర్ వాహనాన్ని పైకి లేపాడు. అతనికి మరికొందరు సాయం చేయబోయారు. కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆటో గేర్‌లో ఉండటంతో పైకి లేపిన తర్వాత ఆగకుండా వెళ్లిపోయింది. డ్రైవర్ ఎంత ఆపే ప్రయత్నం చేసినప్పటికీ అది కంట్రోల్ అవ్వలేదు. అలా రోడ్డుపై దూసుకుంటూ వెళ్లిపోయింది ఆటో. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనదారులు జాగ్రత్తగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా కాసేపు రోడ్డుపై దూసుకువెళ్లిన ఆటో అనంతరం ఓ డౌన్‌లో ఉన్న షాపు వద్ద ఆగింది. కొందరు ఈ దృశ్యాలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ చాలా జరిగాయి. అయితే బైక్స్‌కు ఈ తరహా ప్రమాదాలకు గురవ్వడం చూశాం కానీ.. ఆటోని చూడటం ఇదే ప్రథమం అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Also Read: ఆడుకుంటుండగా చేజారి పగిలిన ఫోన్.. అమ్మ కొడుతుందేమోనని ఆ బాలుడు షాకింగ్ నిర్ణయం

నిమిషం వ్యవధిలో భార్యాభర్తలు మృతి… ఆ దృశ్యం చూసి డాక్టర్ల ఉద్వేగం