Telangana: ఆడుకుంటుండగా చేజారి పగిలిన ఫోన్… అమ్మ కొడుతుందేమోనని ఆ బాలుడు షాకింగ్ నిర్ణయం
ప్రజంట్ జనరేషన్ మొబైల్, గాడ్జెట్లకు బాగా అడిక్ట్ అవుతున్న విషయం తెలిసిందే. ఎక్కువసేపు మొబైల్ యూజ్ చేయొద్దని చెబితే పిల్లలు హర్టవుతున్నారు.

ప్రజంట్ జనరేషన్ మొబైల్, గాడ్జెట్లకు బాగా అడిక్ట్ అవుతున్న విషయం తెలిసిందే. ఎక్కువసేపు మొబైల్ యూజ్ చేయొద్దని చెబితే పిల్లలు హర్టవుతున్నారు. క్షణికావేశంలో పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నారు. గట్టిగా మందిలించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కిడ్స్ దగ్గర్నుంచి.. టీనేజ్ పిల్లల వరకు ఇదే పరిస్థితి. తాజాగా.. భూపాలపల్లి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ 12 ఏళ్ల బాలుడు సెల్‌ఫోన్‌తో ఆడుకుంటుండగా కిందపడి పగలింది. ఈ విషయం తెలిస్తే తల్లి కొడుతుందేమోనని ఆందోళన చెందాడు. ఆ భయంతోనే ఏం చెయ్యాలో తెలియక ఇంట్లో నుంచి పారిపోయాడు. రెండ్రోజుల తర్వాత ఊరి చివర బావిలో శవమై తేలాడు. వివరాల్లోకి వెళ్తే.. చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన చరణ్ ఇంట్లోని మొబైల్ ఫోన్‌తో ఆడుకుంటుండగా అది కింద పడి పగిలింది. తల్లి కొడుతుందేమోనని రెండ్రోజుల క్రితం ఇంటి నుంచి చెప్పా పెట్టకుండా వెళ్లిపోయాడు. ఆ తల్లికి ఎక్కడ వెతికినా బాలుడి జాడ కానరాలేదు. ఫోన్ తీసుకెళ్లాడేమో అని కాల్ చేసి చూస్తే.. ఇంట్లోనే రింగ్ అవుతూ కనిపించింది. అది పగిలిపోయి ఉండటం గమనించిన తల్లి.. భయపడి బయటకు వెళ్లుంటాడని అనుకుంది. ఎంతసేపైనా రాకపోయేసరికి ఆందోళన చెందింది. ఎక్కడా కనిపించకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలుడి కోసం గాలింపు మొదలుపెట్టారు. మంగళవారం ఉదయం ఓ వ్యవసాయ బావిలో చరణ్ డెడ్‌బాడీని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న వారు.. ఆ మృతదేహాన్ని పరిశీలించి అది చరణ్దేనని నిర్ధరించారు. ఫోన్ పగలడం వల్ల తల్లి కొడుతుందేమోననే భయంతో బావిలోకి దూకి ఉంటాడని భావిస్తున్నట్లు చెప్పారు. అనంతరం బావిలో మృతదేహం గురించి చరణ్ పేరెంట్స్‌కు తెలిపారు. కన్నకొడుకు కళ్లముందే నిర్జీవంగా ఉండటం చూసిన ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. ఆమె ఆవేదన స్థానికులను కంటతడి పెట్టించింది.
Also Read:నిమిషం వ్యవధిలో భార్యాభర్తలు మృతి… ఆ దృశ్యం చూసి డాక్టర్ల ఉద్వేగం