AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Weather Report: ఏపీలో క్రమంగా తగ్గుతున్న నైరుతి ప్రభావం.. రాగల 3 రోజుల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు

AP Weather Report: నైరుతి రుతుపవనాల నిష్క్రమణ వేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈశాన్య భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు,

AP Weather Report: ఏపీలో క్రమంగా తగ్గుతున్న నైరుతి ప్రభావం.. రాగల 3 రోజుల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు
Ap Rains
uppula Raju
|

Updated on: Oct 23, 2021 | 2:45 PM

Share

AP Weather Report: నైరుతి రుతుపవనాల నిష్క్రమణ వేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈశాన్య భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు, ఉత్తర బంగాళాఖాతం ప్రాంతం మొత్తం, గోవా, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, తెలంగాణలో కొన్ని ప్రాంతాలు, కర్ణాటక మధ్య అరేబియా సముద్రం ఏరియాలో మరికొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు తిరోగమించాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల తిరోగమన రేఖ కళింగపట్నం, నందిగామ, కర్నూలు, గదగ్ , మజలి ప్రాంతాల గుండా వెళుతున్నది.

అక్టోబర్ 26, 2021న బంగాళాఖాతం, దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలలో ఈశాన్య గాలులు వీచే అవకాశం ఉన్నందు వల్ల నైరుతి రుతుపవనాలు మొత్తం దేశం నుంచి తిరోగమించుకునే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో 26 అక్టోబర్, 2021న ఈశాన్య రుతుపవనాలు భారతదేశంలోని ఆగ్నేయ ద్వీపకల్ప ప్రాంతంలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి.

ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం: ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈరోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ: ఈ రోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాలలో కురిసే అవకాశం ఉంది. భారీవర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాలలో కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.

Samantha-chardham-shilpa reddy: విడాకుల తరువాత భక్తి పరవశంలో మునకలేస్తున్న ‘సమంత’… ఫ్రెండ్ ‘శిల్ప రెడ్డి’ కలిసి ఫొటోస్..

Huzurabad By Election: రేవంత్‌రెడ్డిని కలిసింది వాస్తవమే.. కానీ ఇప్పుడు కలవలేదు.. ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు..

Diwali 2021: దేశ వ్యాప్తంగా మొదలైన దీపావళి సందడి.. ఈ పండగ విశిష్టత ఏమిటంటే..