AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TDP Office: టీడీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు.. సాయంత్రం 5 గంటల్లోగా సీసీ టీవీ ఫుటెజ్ ఇవ్వాలని ఆదేశం..

ఆంధ్రప్రదేశ్‎లోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కార్యాలయ ఉద్యోగి భద్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణలో భాగంగా సీసీ టీవీ ఫుటేజ్ ఇవ్వాలని పోలీసులు కోరారు...

TDP Office: టీడీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు.. సాయంత్రం 5 గంటల్లోగా సీసీ టీవీ ఫుటెజ్ ఇవ్వాలని ఆదేశం..
Tdp
Srinivas Chekkilla
|

Updated on: Oct 23, 2021 | 3:52 PM

Share

ఆంధ్రప్రదేశ్‎లోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కార్యాలయ ఉద్యోగి భద్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణలో భాగంగా సీసీ టీవీ ఫుటేజ్ ఇవ్వాలని పోలీసులు కోరారు. విచారణలో భాగంగా ఇవాళ సాయంత్రం 5 గంటల్లోగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషనుకు వచ్చి వివరాలు అందివ్వాలని కార్యాలయ ఉద్యోగి కుమార స్వామికి నోటీసులు జారీ చేశారు. పార్టీ కార్యాలయం గోడకు పోలీసులు నోటీసులు అతికించారు.

అక్టోబర్ 19న గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. ఆ రోజు సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో మంగళగిరిలోని టీడీపీ పార్టీ కార్యాలయంలోని అద్దాలు, ఫర్నిచర్‎తో సహా కార్యాలయం వద్ద పార్క్ చేసిన పలు వాహనాలను వారు ధ్వంసం చేశారు. ఈ దాడిపై కార్యాలయ ఉద్యోగి భద్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు టీడీపీ అధికార ప్రతినిధి, పార్టీ సీనియర్ నేత పట్టాభిరామ్ ఇంటిపై దాడి కేసులో ఇప్పటివరకు 11 మంది అరెస్ట్ చేశామని విజయవాడ సీపీ వెల్లడించారు. పట్టాభి భార్య చందన ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ వేగవంతం చేశామని ఇవాళ విడుదల చేసిన ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. దాడి జరిగిన ప్రాంతంలోని ఆధారాలు, చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఆధారంగా 11 మంది అరెస్ట్ చేసినట్టు తెలిపారు. పట్టాభి ఇంటిలోని సీసీ ఫుటేజీ డీవీఆర్ ఇవ్వమని కోరామని.. డీవీఆర్ అందిన తర్వాత విచారణ మరింత వేగవంతం చేస్తామని సదరు ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా, పట్టాభి భార్య చందన ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసిన పడమట పోలీసులు.. రాత్రి పదకొండు మంది నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఆ పదకొండు మంది విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. ఇంటి చుట్టు ప్రక్కల సిసి కెమెరాల ఆధారంగా పదకొండు మందిని గుర్తించామని.. పట్టాభి ఇంట్లో ఉన్న డివిఆర్ ఇచ్చిన తర్వాత మిగిలిన వారిని గుర్తించి అరెస్ట్ చేస్తామని సీపీ శ్రీనివాసులు తెలిపారు.

Read Also.. TDP vs YCP: పట్టాభిని అందుకే అరెస్ట్ చేయాల్సి వచ్చింది.. రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు పేర్కొన్న పోలీసులు..