TDP Leader Pattabhi: టీడీపీ నేత పట్టాభికి బెయిల్.. మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన టీడీపీ నేత పట్టాభికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజురూ చేసింది. కాగా, పట్టాభి ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన టీడీపీ నేత పట్టాభికి బెయిల్ మంజూరు అయింది. 41 సీఆర్పీసీ సమాధానం రాకుండానే ఎందుకు అరెస్ట్ చేశారంటూ ఏపీ పోలీసులపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. క్రింద కోర్టు మేజిస్ట్రేట్ ఎలా రిమాండ్ ఇచ్చారో చెప్పాలని.. ఎలా పడితే అలా ప్రొసీజర్ లేకుండా చేస్తారా అంటూ జడ్జీ పోలీసులపై ధ్వజమెత్తారు. బుధవారం పట్టాభిని ఏపీ పోలీసులు అరెస్ట్ కాగా.. తాజాగా పట్టాభికి ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. కాగా, పట్టాభి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.
కాగా, కొద్దిరోజుల క్రితం ఓ మీడియా సమావేశంలో టీడీపీ నేత పట్టాభి.. ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనితో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే కొందరు వైసీపీ నేతలు.. టీడీపీ కార్యాలయాలపై దాడులు చేయగా.. అందుకు నిరసనగా టీడీపీ పార్టీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్ష చేయగా.. టీడీపీ బూతు వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ.. జనాగ్రహ దీక్షలు చేపట్టిన విషయం విదితమే.