AP Weather Report: తిరోగమిస్తున్న నైరుతిరుతుపవనాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం..
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాల తిరోగమనరేఖ కళింగపట్నం, నందిగామ, కర్నూలు, గదగ్ , మజలి ప్రాంతముల గుండా వెళుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య గాలులు వీచే అవకాశం ఉన్నందువలన సుమారుగా రాగల 48 గంటలలో దేశం అంతట నుంచి నైరుతి రుతుపవనాలు తిరోగమించుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపింది...
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాల తిరోగమనరేఖ కళింగపట్నం, నందిగామ, కర్నూలు, గదగ్ , మజలి ప్రాంతముల గుండా వెళుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య గాలులు వీచే అవకాశం ఉన్నందువలన సుమారుగా రాగల 48 గంటలలో దేశం అంతట నుంచి నైరుతి రుతుపవనాలు తిరోగమించుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అదే సమయంలో రాగల 48 గంటలలో ఈశాన్య రుతుపవనాలు భారతదేశంలోని ఆగ్నేయ ద్వీపకల్ప ప్రాంతంలో ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఉత్తర తమిళనాడు తీరం, దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది.
ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలో ఈరోజు, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈరోజు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు పడే అవకాశం ఉంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది.
ఈరోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావత్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Read Also.. MLA Vallabaneni Vamsi: చంద్రబాబుపై ఓ రేంజ్‌లో పంచ్‌లు పేల్చిన MLA వల్లభనేని వంశీ.!