T20 World Cup: పాకిస్తాన్‌ భరతం పట్టనున్న టీమిండియా.. ఆ వరల్డ్‌కప్ హీరోస్‌లో ఇప్పుడు ఆడేది ముగ్గురే.!

2007 టీ20 ప్రపంచకప్‌ పూర్తై 14 ఏళ్లు గడుస్తోంది. అప్పుడు ఫైనల్‌లో టీమిండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై చారిత్రక విజయాన్ని నమోదు..

T20 World Cup: పాకిస్తాన్‌ భరతం పట్టనున్న టీమిండియా.. ఆ వరల్డ్‌కప్ హీరోస్‌లో ఇప్పుడు ఆడేది ముగ్గురే.!
India Vs Pakistan
Follow us

|

Updated on: Oct 23, 2021 | 9:55 PM

2007 టీ20 ప్రపంచకప్‌ పూర్తై 14 ఏళ్లు గడుస్తోంది. అప్పుడు ఫైనల్‌లో టీమిండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై చారిత్రక విజయాన్ని నమోదు చేసుకుని చరిత్ర సృష్టించింది. అది కూడా మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని సారధ్యంలో ఇదంతా జరిగింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లకు 157\5 పరుగులు చేసింది. ఇక లక్ష్యచేధనలో భాగంగా పాకిస్తాన్ 19.3 ఓవర్లకు 152 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో ఇర్ఫాన్ పఠాన్, ఆర్పీ సింగ్ మూడేసి వికెట్లు తీయగా, జోగిందర్ శర్మ 2 వికెట్లు పడగొట్టి.. పాకిస్తాన్ పతనంలో కీలక పాత్ర పోషించారు. ఈ అద్భుత విజయంతో టీమిండియా తొలి టీ20 వరల్డ్‌ ఛాంపియన్‌గా నిలిచింది.

ఇదిలా ఉంటే.. తాజాగా 2021 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్-2లో టీమిండియా పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడనుంది. మరికొద్ది గంటల్లో ఈ మ్యాచ్ ప్రసారం కానుంది. ఇక 2007 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో పాకిస్తాన్‌, టీమిండియా జట్ల తరపున ఆడిన ఆటగాళ్లలో ప్రస్తుత మ్యాచ్‌ను ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే ఆడనున్నారు. వారిలో టీమిండియా నుంచి రోహిత్‌ శర్మ అయితే.. పాకిస్తాన్‌ నుంచి మహ్మద్‌ హఫీజ్‌, షోయబ్‌ మాలిక్‌లు ఈ జాబితాలో ఉన్నారు.

2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో వీరు ఎన్ని పరుగులు చేశారో ఓ లుక్కేద్దాం..

1. రోహిత్‌ శర్మ: ప్రస్తుతం టీమిండియాకు వైస్‌ కెప్టెన్‌, స్టార్‌ ఓపెనర్‌

2007 టీ20 ప్రపంచకప్‌ ద్వారానే రోహిత్‌ శర్మ టి20ల్లోకి అరంగేట్రం చేశాడు. పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో యువరాజ్‌, ధోనిలు ఔటైన తర్వాత ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్‌ 16 బంతుల్లో 30 పరుగులు చేశాడు. రోహిత్ ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్స్‌ ఉంది.

2. మహ్మద్‌ హఫీజ్‌: పాకిస్తాన్‌ వెటరన్‌ ఆల్‌రౌండర్‌

పాకిస్తాన్‌ వెటరన్‌ ఆల్‌రౌండర్‌ మహ్మద్ హఫీజ్‌2007 టీ20 ప్రపం‍చకప్‌ ఫైనల్లో ఓపెనింగ్‌ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. ఆ మ్యాచ్‌లో ఆర్‌పీ సింగ్‌ బౌలింగ్‌‌లో తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. 3 బంతులాడి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేయగలిగాడు. ఇక బౌలింగ్‌‌లోనూ హఫీజ్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. మూడు ఓవర్లు వేసిన హఫీజ్‌ 25 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ తీయలేదు.

3. షోయబ్‌ మాలిక్‌: నాడు పాకిస్తాన్ కెప్టెన్

2007 టి20 ప్రపంచకప్‌కు షోయబ్‌ మాలిక్‌ పాకిస్తాన్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. జట్టును విజయవంతంగా ఫైనల్‌‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే టీమిండియాతో జరిగిన ఫైనల్లో మాత్రం విఫలం అయ్యాడు. మాలిక్ 17 బంతులాడి 8 పరుగులు మాత్రమే చేశాడు. అటు బౌలింగ్‌లో ఒక్క ఓవర్‌ కూడా వేయలేదు. ఇక ప్రస్తుత పాకిస్తాన్ టీంలో ముందుగా పీసీబీ మాలిక్ పేరును ప్రకటించలేదు. చివరి నిమిషంలో సోహైబ్‌ మక్సూద్‌ గాయంతో వైదొలగొడంతో షోయబ్‌ మాలిక్ జట్టులోకి తిరిగి వచ్చాడు. కెప్టెన్ బాబర్ ఆజామ్.. మాలిక్‌కు మద్దతుగా నిలిచాడని టాక్.

నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..