Viral Video: అడవి పిల్లి హాలివుడ్ స్టంట్.. యాక్షన్ హీరోకే పోటీ.. దుమ్ములేపుతున్న వీడియో.!

సోషల్ మీడియాలో రకరకాల జంతువులు, పక్షుల వీడియోలను మనం ప్రతిరోజూ చూస్తూనే ఉంటాం. వాటిలో కొన్ని రొటీన్‌గా ఉన్నా...కొన్ని వీడియోలను..

Viral Video: అడవి పిల్లి హాలివుడ్ స్టంట్.. యాక్షన్ హీరోకే పోటీ.. దుమ్ములేపుతున్న వీడియో.!
Cat
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 23, 2021 | 9:50 PM

సోషల్ మీడియాలో రకరకాల జంతువులు, పక్షుల వీడియోలను మనం ప్రతిరోజూ చూస్తూనే ఉంటాం. వాటిలో కొన్ని రొటీన్‌గా ఉన్నా…కొన్ని వీడియోలను ఎంతసేపైనా చూసేందుకు ఇష్టపడతాం. ఎందుకంటే వాటిలో మనకు తెలియని ఓ కొత్త విషయం ఉంటుంది. ఇప్పుడు మనం చూడబోయే వీడియోలు కూడా అలాంటివే.

ఇందులో ఓ అడవి పిల్లి టేబుల్‌పై నుంచి అమాంతం ఫ్రిజ్‌పైకి దూకడం జరుగుతుంది. అసలు ఆ జంప్‌ చూస్తే ఫిదా అవ్వాల్సిందే. ఇక మరో వీడియోలో ఈ అడవి పిల్లి అచ్చం మాములు పిల్లి లాగే మారాం చేస్తూ బెడ్‌పై దొర్లుతుండటం మీరు చూడవచ్చు. అయితే దాని అరుపు వింటే మాత్రం తప్పకుండా భయపడతారు.

ఎందుకంటే మామూలు పిల్లి లాగా అది మ్యావ్ అనదు. వింతగా అరుస్తుంది. ఇది సెర్వల్ జాతికి చెందిన పిల్లి. ఈ జాతి పిల్లులు ఎక్కువగా ఆఫ్రికా అడవుల్లో జీవిస్తాయి. మామూలు పిల్లి కంటే పొడవుగా పెరుగుతాయి. దాదాపు చిరుత పులిని పోలివుండే వీటి చెవులు పెద్దగా ఉంటాయి, కాళ్లుకూడా పొడవుగా ఉంటాయి. చర్మంపై చుక్కలు, చారలూ ఉంటాయి.

ఇవి వన్య మృగాలు. వీటిని ఇళ్లలో పెంచుకోకూడదు. ఇవి మనుషుల్ని చంపవు గానీ… తమకు హాని జరుగుతుంది అనుకుంటే మాత్రం గోళ్లతో రక్కుతాయి. అందువల్ల వీటిని ఇళ్లలో పెంచుకోవడం ప్రమాదకరం అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతోంది. వేలమంది ఆ పిల్లిని లైక్‌ చేస్తున్నారు. తమకు దానిని పెంచుకోవాలనుందంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే