Andhra Pradesh, Telangana News: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి టాప్-9 వార్తలు ఇవే..
తెలంగాణ క్రీడలకు పుట్టినిల్లు లాంటిదనన్నారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మెరుగైన పాలసీని తీసుకొస్తామని తెలిపారు. గోవాలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ బాడీ బిల్డింగ్ పోటీల పోస్టర్‌ను
1. రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు టీడీపీ నేత పట్టాభి. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ కూడలిలో పట్టాభికి స్వాగతం పలికారు స్థానిక నేతలు. ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని చెప్పారు పట్టాభి.
2. ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఫైర్ అయ్యారు టీడీపీ నేత అర్డునుడు. వంశీపై పోటీ చేయడానికి లోకేశ్, పరిటాల సునీత అవసరం లేదన్నారు. రాజీనామా చేస్తే ఆయనపై పోటీ చేయడనికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు టీడీపీ నేత.
3. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మరోసారి ఫైర్ అయ్యారు మంత్రి బాలినేని. బాబు మాటలు వినేవారు ఢిల్లీలో ఎవరూ లేరని సెటైర్ వేశారు మంత్రి. అసలు అమిత్‌షా చంద్రబాబుకు అపాంట్‌మెంట్ ఇవ్వరన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి.
4. విజయనగరం జిల్లా కురుపాంలో ఉద్రిక్తత నెలకొంది. గిరిజన ఇంజినీరింగ్ కాలేజీ నిర్మాణ పనులను అడ్డుకున్నారు రైతులు. తమ భూములకు నష్టపరిహారం చెల్లించాకే పనులు ప్రారంభించాలని ధర్నా చేశారు అన్నదాతలు.
5. కర్నూలు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది. అఖిలప్రియ టీడీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరబోతున్నారనే చర్చ జరుగుతోంది. ఈ ఇష్యూపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
6. పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. వనపర్తి జిల్లా లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్‌గా ఆశిష్ సంగ్వాన్‌కు పోస్టింగ్ ఇచ్చింది సర్కారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా భవేశ్ మిశ్రాను నియమించింది.
7. తెలంగాణ క్రీడలకు పుట్టినిల్లు లాంటిదనన్నారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మెరుగైన పాలసీని తీసుకొస్తామని తెలిపారు. గోవాలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ బాడీ బిల్డింగ్ పోటీల పోస్టర్‌ను ఆవిష్కరించారు మంత్రి.
8. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడిని ఖండిస్తూ హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహించారు ఇస్కాన్ భక్తులు. శాంతియుతంగా పూజలు చేస్తున్నవారిపై దాడులేంటని ప్రశ్నించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు భక్తులు.
9. హుజూరాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటైందన్నారు మంత్రి కేటీఆర్. ఉపఎన్నికలో కాషాయ, హస్తం పార్టీల ఉమ్మడి అభ్యర్థి పోటీ చేస్తున్నారని విమర్శించారు. ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి రహస్యంగా భేటీ అయ్యారని ఆరోపించారు కేటీఆర్. కాగా, మంత్రి కేటీఆర్ కామెంట్స్‌తో మాటల తూటాలు పేలుతున్నాయి. టీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేశాక రేవంత్ రెడ్డిని కలిస్తే తప్పేంటని కేటీఆర్‌ను ప్రశ్నించారు ఈటల.