Burj Khalifa: బుర్జ్ ఖలీఫాపై ‘బతుకమ్మ’ లేజర్ షో.. సంతోషంతో కేరంతలు వేసిన ఎమ్మెల్సీ కవిత..

Burj Khalifa: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నిర్మాణంగా ఖ్యాతి గడించిన బుర్జ్ ఖలీఫాపై తెలంగాణ కీర్తి పతాక రెపరెపలాడింది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ దివ్య

Burj Khalifa: బుర్జ్ ఖలీఫాపై ‘బతుకమ్మ’ లేజర్ షో.. సంతోషంతో కేరంతలు వేసిన ఎమ్మెల్సీ కవిత..
Burj Khalifa
Follow us

|

Updated on: Oct 24, 2021 | 7:11 AM

Burj Khalifa: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నిర్మాణంగా ఖ్యాతి గడించిన బుర్జ్ ఖలీఫాపై తెలంగాణ కీర్తి పతాక రెపరెపలాడింది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ దివ్య రూపం బుర్జ్ ఖలీఫాలపై కాంతిపుంజమై సాక్ష్యాత్కరించింది. శనివారం నాడు రాత్రి 9.45 గంటలకు తిరిగి 10.30 గంటలకు తెలంగాణ సాంస్కృతిక వైభవ దృశ్యమాలిక బుర్జ్ ఖలీఫాపై కనువిందు చేసింది. తెలంగాణ మలిదశ ఉద్యమ ప్రస్థానాన్ని టీఆర్‌ఎస్‌ స్థాపనతో ప్రారంభించి రెండు దశాబ్దాలు పూర్తయిన ఈ సందర్భంగా బుర్జ్‌ ఖలీఫాపై తెలంగాణ అస్తిత్వాన్ని ప్రదర్శింపజేయడం ద్వారా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు అద్భుతమైన రీతిలో శుభాకాంక్షలు తెలిపారు.

బుర్జ్ ఖలీఫా భవనంపై తెలంగాణ పూల పండుగైన బతుకమ్మ సహా సీఎం కేసీఆర్, కేటీఆర్, తెలంగాణ చిత్రపటం ప్రదర్శించడం జరించింది. ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ ఎత్తుకున్న చిత్రం సైతం బుర్జ్ ఖలిఫా భవనంపై ప్రదర్శించారు. ఈ అద్భుతమైన లేజర్ షో ప్రదర్శిస్తున్న సమయంలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మరికొందరు నాయకులు కూడా అక్కడే ఉన్నారు. లేజర్ షోను చూస్తూ కవిత కేరంతలతో సందడి చేశారు. అద్భుత దృశ్యాన్ని చూసి మురిసిపోయారు. బుర్జ్‌ ఖలీఫాపై ప్రత్యేకంగా వ్యక్తుల ఫొటోలను లేజర్‌షోలో ప్రదర్శించటం అత్యంత అరుదు. ఇప్పటివరకు మహాత్మాగాంధీ, బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌ చిత్రాలను మాత్రమే ప్రదర్శించారు. ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం అయిన బతుకమ్మ సహా తెలంగాణ చిత్రపటం, ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, కవిత ఫోటోలు ప్రదర్శించడం విశేషం.

Also read:

Garuda Garvabhangam: బాధ్యత గర్వంగా మారి తలకెక్కితే గర్వభంగం తప్పదని తెలియజెప్పే గరుత్మంతుడు కథ

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో బెస్ట్ కపుల్‌‌‌‌గా ఆ ఇద్దరు కంటెస్టెంట్స్.. వాళ్ళు ఎవరంటే..

Silver Price Today: పరుగులు పెడుతున్న వెండి.. హైదరాబాద్‌లో మాత్రం భారీగా పెరిగింది..!