Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో బెస్ట్ కపుల్‌‌‌‌గా ఆ ఇద్దరు కంటెస్టెంట్స్.. వాళ్ళు ఎవరంటే..

వారాంతం వచ్చిందటే చాలు బిగ్ బాస్ హౌస్‌లో సందడి రెట్టింపు అవుతుంది. హోస్ట్ నాగార్జున చేసే హడావిడితో హౌస్ మేట్స్‌లో జోష్ మరింత పెరుగుతుంది.

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో బెస్ట్ కపుల్‌‌‌‌గా ఆ ఇద్దరు కంటెస్టెంట్స్.. వాళ్ళు ఎవరంటే..
Bigg Boss
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 24, 2021 | 6:36 AM

Bigg Boss 5 Telugu: వారాంతం వచ్చిందటే చాలు బిగ్ బాస్ హౌస్‌లో సందడి రెట్టింపు అవుతుంది. హోస్ట్ నాగార్జున చేసే హడావిడితో హౌస్ మేట్స్‌లో జోష్ మరింత పెరుగుతుంది. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో వారం రోజుల పాటు జరిగిందంతా మరోసారి ప్రేక్షకులకు చూపించారు నాగార్జున. అలాగే హౌస్ మేట్స్ కు క్లాస్ తీసుకున్నారు నాగార్జున. నామినేషన్ ప్రక్రియతో పాటు ఆ తరువాత జరిగిన కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో ఇంటి సభ్యులు పోటీపడి మరీ పాల్గొన్నారు. ఈ వారంలో ముఖ్యంగా సన్నీ-ప్రియల మధ్య జరిగిన గొడవ హైలైట్ అనే చెప్పాలి. ఇద్దరి మధ్య చిన్న సైజ్ యుద్ధమే జరిగింది. కొత్త కెప్టెన్‌గా సన్నీ ఎంపికయ్యారు. మ్యాట్రిమొనీ వారి పెళ్లి సంబంధాల టాస్క్‌లో మానస్, ప్రియాంక, షణ్ముఖ్, సిరి, శ్రీరామ్‌లు పాల్గొన్నారు. తమకి కాబోయే వాళ్లలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చెప్పాలని కోరారు నాగార్జున.

మొత్తంగా ఇంటి సభ్యుల అందరి నిర్ణయంతో మానస్, ప్రియాంకలు బెస్ట్ కపుల్స్‌గా నిలిచారు. దీనిపై ప్రియ, ఆనీ, రవిల మధ్య చర్చ నడిచింది. పింకీ మానస్ విషయంలో క్లారిటీతోనే ఉంది కదా అని రవి అడగ్గా.. పిచ్చ క్లారిటీతో ఉందని ప్రియ చెప్పింది. ఈ సందర్భంలో సిరి దగ్గర స్టిక్కర్స్ దొంగతనం చేసింది.. నేనే అంటూ సీక్రెట్ బయటపెట్టాడు రవి. ఎలా ఎత్తేసేనో ఎవరికీ తెలియదంటూ విషయాన్ని బయటపెట్టాడు. అలాగే  రవి.. తన గేమ్ ఆడకుండా మనతో గేమ్స్ ఆడుతున్నాడు. శ్రీరామ్‌ని కూడా తనవైపుకి తిప్పుకున్నాడు. లోబో, విశ్వలు కూడా రవి కోసమే ఆడుతున్నారని షణ్ముఖ్ కాజల్‌తో చెప్పుకొచ్చాడు. ఇక కెప్టెన్ పోటీదారుల టాస్క్ అయిపోయిన తరువాత వరస్ట్ పెర్ఫామర్ ఎవరన్నదానిపై రచ్చ జరిగింది.  ఈవారం నామినేషన్స్‌లో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉండగా.. వారిలో శ్రీరామ్, కాజల్‌లను సేఫ్ చేశారు. మిగిలిన ఆరుగురు రవి, సిరి, లోబో, జెస్సి, ఆనీ, ప్రియలు డేంజర్ జోన్‌లోనే ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది నేటి ఎపిసోడ్ లో తెలియనుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral News: బీహార్‌లో హాట్ టాపిక్‌గా మారిన నటుడు రామిరెడ్డి.. తెలుగు దివంగత నటుడు అక్కడ ఎందుకనేగా..

RK Selvamani: దర్శకుడు సెల్వమణి బర్త్ డే వేడుకలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోస్..

Mahesh Babu: సర్కారు వారి పాటకు శేఖర్‌ మాస్టర్‌ స్టెప్పులు.. సినిమా సెట్‌లో దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ..