AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేనా.. ఇది నిజంగా ఊహించని షాక్..

బిగ్ బాస్ హౌస్ నుంచి ఇప్పటికే ఒకొక్కరిగా బయటకు వచ్చేస్తున్నారు. శనివారం నాటి బిగ్ బాస్ సీజన్ 5 ఎపిసోడ్ 49 ఎపిసోడ్లు పూర్తిచేసుకుంది.

Bigg Boss 5 Telugu: ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేనా.. ఇది నిజంగా ఊహించని షాక్..
Bigg Boss 5
Rajeev Rayala
|

Updated on: Oct 24, 2021 | 7:02 AM

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ నుంచి ఇప్పటికే ఒకొక్కరిగా బయటకు వచ్చేస్తున్నారు. శనివారం నాటి బిగ్ బాస్ సీజన్ 5 ఎపిసోడ్ 49 ఎపిసోడ్లు పూర్తిచేసుకుంది. ఇక ఇప్పటికే హౌస్ నుంచి సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీద, శ్వేతవర్మ బయటకు వచ్చారు. ఇక ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు రానున్నారా అన్నది ఆసక్తిగా మారింది. ఈవారం నామినేషన్స్‌లో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉండగా.. వారిలో శ్రీరామ్, కాజల్‌లను సేఫ్ చేశారు. మిగిలిన ఆరుగురు రవి, సిరి, లోబో, జెస్సి, ఆనీ, ప్రియలు డేంజర్ జోన్‌లోనే ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది నేడు తెలిసిపోతుంది. అయితే డేంజర్ జోన్ లో ఉన్నవారిలో ఎక్కువ శాతం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎవరికీ ఉందంటే..

ఈ వారం హౌస్ నుంచి ప్రియా ఎలిమినేట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆమె ఈవారం హౌస్ నుంచి బయటకు వస్తుందని తెలుస్తుంది. నిజానికి ఆనీ మాస్టర్‌కి ఓట్లు తక్కువ పడుతుండటంతో ఆమె ఎలిమినేట్ అవుతుందనే అనుకున్నారు. కానీ ఈ వారం ప్రియా అవుట్ అవ్వనుందని తెలుస్తుంది. అయితే ఈవారం ప్రియాకు సన్నీకి మధ్య జరిగిన గొడవ గురించి అందరికి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ కే హైలైట్ గా ఈ వార్ జరిగింది. బంగారు కోడిపెట్ట అనే కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా గుడ్లను పదే పదే దొంగిలిస్తూ.. సన్నీని కావాలని రెచ్చగొట్టింది. దాంతో రెచ్చిపోయిన సన్నీ ఆమె పై సీరియస్ అయ్యాడు. గుడ్డును దొంగతనం చేస్తున్న సమయంలో సన్నీ ప్రియను నెట్టేశాడు. దాంతో చెంప పగిలిపోద్ది అంటూ రెచ్చిపోయింది ప్రియా దానికి సన్నీ కూడా సీరియస్‌గానే రియాక్ట్ అయ్యాడు. దమ్ముంటే కొట్టి చూడు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈ వ్యవహారంతో ప్రియా పై ప్రేక్షకుల్లో అభిప్రాయం మారిందని తెలుస్తుంది. దాంతో ఆమెకు ఓట్లు తక్కువ పడ్డాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రియా హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వనుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో బెస్ట్ కపుల్‌‌‌‌గా ఆ ఇద్దరు కంటెస్టెంట్స్.. వాళ్ళు ఎవరంటే..

Nivetha Thomas: వావ్.. అరుదైన ఫీట్ సాధించిన నేచురల్ బ్యూటీ నివేదా థామస్.. కష్టానికి సలామ్ కొట్టాల్సిందే..!

Maa Elections 2021: ప్రకాష్ రాజ్ ప్యానెల్‌తోపాటు నాగబాబు రాజీనామాను తిరస్కరించిన ఈసీ..

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..