Google Chrome: గూగుల్ క్రోమ్ లో నయా ఫీచర్.. పెద్ద సమస్యకు పరిష్కారం దొరికిందోచ్చ్..

యూజర్లను ఆకట్టుకోవడానికి క్రోమ్ కూడా అనేక కొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు మరో కొత్త ఫీచర్ ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

Google Chrome: గూగుల్ క్రోమ్ లో నయా ఫీచర్.. పెద్ద సమస్యకు పరిష్కారం దొరికిందోచ్చ్..
Google Chrome
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Dec 20, 2022 | 3:02 PM

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ట్రెండ్ నడుస్తుంది. ప్రపంచమంతా అరచేతిలోనే అనేనంతగా ప్రతి ఒక్కరూ చిన్న విషయమైన ఫోన్ పైనే ఆధారపడుతున్నారు. ఎలాంటి డౌట్ వచ్చినా గూగుల్లో సెర్చ్ చేయడం అనేది అలవాటుగా మారింది. మొదట్లో అనేక సెర్చ్ ఇంజిన్లు యూజర్లను ఆకట్టుకున్నా.. ప్రస్తుతం అందరూ గూగుల్ క్రోమ్ నే వాడుతున్నారు. యూజర్లను ఆకట్టుకోవడానికి క్రోమ్ కూడా అనేక కొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు మరో కొత్త ఫీచర్ ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

చాలా మంది ఆన్ లైన్ లో ఆర్డర్ చేసినప్పుడు ధర విషయంలో కొంచెం డౌట్ ఉంటుంది. ఇతర సెల్లర్ ఇంకా తక్కువ ధరకు ప్రొడెక్ట్ ఇస్తున్నాడా? అనే అనుమానంతో ఉంటాం. ఇలాంటి ఇబ్బంది లేకుండా క్రోమ్ ప్రైస్ డ్రాప్ (ధర తగ్గింపు) ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. మనం సెర్చ్ చేసిన ప్రొడెక్ట్స్ రేట్ విషయంలో ఎలాంటి మార్పులు జరిగినా ఈ-మెయిల్ లేదా మొబైల్ నోటిఫికేషన్ల ద్వారా మనకు అలెర్ట్ అందనుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం యూఎస్ లోని డెస్క్ టాప్, ఆండ్రాయిడ్ పరికరాల్లో అందుబాటులో ఉంది. షాపింగ్ చేస్తున్నప్పడు క్రోమ్ అడ్రస్ బార్ లో ‘ట్రాక్ ద రేట్’ను సెలెక్ట్ చేసుకుంటే సైడ్ ప్యానెల్ ద్వారా మనం ఎంచుకున్న ప్రొడెక్ట్స్ ధర ఏ సెల్లర్ తక్కువకు ఇస్తున్నాడో? నోటిఫికేషన్ల ద్వారా తెలుసుకోవచ్చు. 

ఈ ఫీచర్ తో వినియోగదారులు తమ షాపింగ్ కార్ట్ లో తక్షణమే తగ్గింపులను పొందవచ్చు. కార్ట్ లో ఐటెమ్స్ ను యాడ్ చేసినప్పుడు క్రోమ్ రిటైలర్ అందిస్తున్న తగ్గింపు కోడ్ లు ఆటోమెటిక్ గా రిడీమ్ అయ్యి చెక్ అవుట్ లో చూపిస్తుంది. మనకు ఇంకా అనుమానం ఉంటే కొత్త ట్యాబ్  తీసుకుని అందులో సెర్చ్ చేస్తే మనం తగ్గింపు ధరలను చూడవచ్చు. అలాగే మనం కొనాలనే ప్రొడెక్ట్ ఇమేజ్ ను అప్ లోడ్ చేస్తే గూగుల్ లెన్స్ ద్వారా ప్రొడెక్ట్ ఏ సెల్లర్ తక్కువకు అందిస్తున్నాడో మనకు తెలుస్తుంది. ఒకవేళ ప్రొడెక్ట్ అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉండి తిరిగి ఇన్ స్టాక్ లోకి రాగానే మనకు నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం అమెరికాలో అందుబాటులో ఉంది. కానీ భారత్ లో ఈ ఫీచర్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఫ్యూచర్ లో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని ఆశిద్దాం. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..