AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elon Musk Twitter: ఎలాన్‌ మస్క్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన ట్విటర్‌ యూజర్లు.. 10 మిలయన్ల ఓట్లు అందుకేనట..

బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌కు ట్విటర్‌ యూజర్లు బిగ్‌ షాక్‌ ఇచ్చారు. ట్విటర్‌కు సీఈవోగా కొనసాగాలా? వద్దా? అనే విషయంపై తన ట్విటర్‌ ఖాతా నుంచి సోమవారం సర్వే నిర్వహించిన సంగతి..

Elon Musk Twitter: ఎలాన్‌ మస్క్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన ట్విటర్‌ యూజర్లు.. 10 మిలయన్ల ఓట్లు అందుకేనట..
Elon Musk Twitter poll results
Srilakshmi C
|

Updated on: Dec 20, 2022 | 12:03 PM

Share

బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌కు ట్విటర్‌ యూజర్లు బిగ్‌ షాక్‌ ఇచ్చారు. ట్విటర్‌కు సీఈవోగా కొనసాగాలా? వద్దా? అనే విషయంపై తన ట్విటర్‌ ఖాతా నుంచి సోమవారం సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ రోజు దానికి సంబంధించిన తుది ఫలితాలు వెలువడ్డాయి. ఐతే దాదాపు 10 మిలయన్లకు పైగా (57.5 శాతం) మంది మస్క్‌ను ట్విటర్‌ సీఈవో నుంచి వైదొలగవల్సిందిగా కోరారు. ఇక 42.5 శాతం మంది సీఈవోగా కొనసాగడం తమకు అంగీకారమేనని ఓటు ద్వారా తెలియజేశారు. ఫలితాలు ఏ విధంగా వచ్చినా దానికి కట్టుబడి ఉంటానని చెప్పిన మస్క్‌ తీరా పోల్‌ ఫలితాలు వచ్చాక సైటెంట్‌ అయిపోయాడు. నిజానికి ఫలితాలు వచ్చిన వెంటనే మస్క్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించలేదు. ఐతే ఫేక్ అకౌంట్ల వల్ల ఫలితాలు తారుమారయ్యాయని భావించి ‘ఇంటరెస్టింగ్‌’ అని ట్వీట్ చేశాడు. ‘పాలసీ సంబంధిత పోల్‌లో బ్లూటిక్‌ సబ్‌స్క్రైబర్లు మాత్రమే మీకు అనుకూలంగా ఓటు వేయగలరు’ అని కామెంట్‌ సెక్షన్‌లో ఓ యూజర్‌ పేర్కొనగా.. ‘గుడ్ పాయింట్‌. ట్విటర్ ఈ మార్పును తప్పక తీసుకొస్తుందని’ మస్క్‌ సమాధానం ఇచ్చారు. దీనికి సంబంధించి త్వరలోనే మార్పులు చేయనున్నట్లు వెల్లడించారు. ట్విటర్‌ అధిపతిగా తాను తప్పుకోవాలా.. వద్దా? అనే దానిపై మస్క్‌ నిర్వహించిన పోల్‌లో కేవలం ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు..

కాగా ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ పగ్గాలను చేపట్టిన తర్వాత కొన్ని కారణాల రిత్యా మద్దతుదారులు అతనితో సన్నిహిత సంబంధాలను వదులుకున్నారని సమాచారం. మాస్క్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవి నుంచి వైదొలగే ఆలోచన కూడా ట్విటర్ పోల్ నిర్వహించడానికంటే చాలా కాలం ముందుగానే నిర్ణయం తీసుకున్నాడట. నవంబర్ 16న ఈ నిర్ణయానికి అంకురం పడింది. ట్విటర్‌కు తను కేటాయించే సమయాన్ని తగ్గించుకోవాలనుకున్నట్లు, మనుముందు ట్విటర్‌ను నడపడానికి వేరొకరిని నియమించాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.