JEE Main 2023: జేఈఈ మెయిన్‌ మొదటి సెషన్‌ పరీక్ష వాయిదా..? మళ్లీ పరీక్షల తేదీలతో పేచీ..

జేఈఈ మెయిన్‌-2023 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. షెడ్యూల్‌ ప్రకారం మొదటి సెషల్ పరీక్ష జనవరి 24 నుంచి 31వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ క్రమంలో పరీక్షల తేదీలు..

JEE Main 2023: జేఈఈ మెయిన్‌ మొదటి సెషన్‌ పరీక్ష వాయిదా..? మళ్లీ పరీక్షల తేదీలతో పేచీ..
JEE Main 2023
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 19, 2022 | 1:30 PM

జేఈఈ మెయిన్‌-2023 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. షెడ్యూల్‌ ప్రకారం మొదటి సెషల్ పరీక్ష జనవరి 24 నుంచి 31వ తేదీ వరకు జరగనున్నాయి. మధ్యలో రిపబ్లిక్‌ డే రోజున సెలవు ఉంటుంది. మరోవైపు సీబీఎస్సీ 12వ తరగతి బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఇక ప్రాక్టికల్ పరీక్షలు జనవరిలోనే ప్రారంభం అవుతున్నాయి. అస్సాం బోర్డ్ ప్రాక్టికల్స్ జనవరి 25 నుంచి, బీహార్ బోర్డ్ ప్రాక్టికల్స్ జనవరి 10 నుంచి, తెలంగాణ బోర్డ్ ప్రాక్టికల్స్ జనవరి 20 నుంచి.. ఇలా పలు రాష్ట్రాల్లో బోర్డు పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. ఈ క్రమంలో సీబీఎస్సీ పరీక్షల తేదీలు, జేఈఈ మెయిన్‌ పరీక్షల తేదీలతో క్లాష్‌ అవుతున్నాయని, జేఈఈ పరీక్షను వాయిదా వేయవల్సిందిగా “postponeJEEMains” అనే హ్యాష్‌ ట్యాగ్‌ నెట్టింట ట్రెండ్‌ అవుతోంది. అంతేకాకుండా దీనిని కేంద్ర విద్యాశాఖ, నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ)లకు ట్యాగ్‌ చేసి జేఈఈని వాయిదా వేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఇక షెడ్యూల్‌ ప్రకారం.. జేఈఈ రెండో సెషన్‌ ఏప్రిల్ 6, 8, 10, 11,12 తేదీల్లో జరనున్నాయి.

ఇంజనీరింగ్‌ విద్యనభ్యసిండం అనేది దేశంలో లక్షలాది విద్యార్ధుల చిరకాల కల. ఈ క్రమంలో అనాలోచితంగా పరీక్షల షెడ్యూల్‌ను రూపొందించి పిల్లల భవిష్యత్తుపై నీళ్లు చల్లుతున్నారంటూ విద్యార్ధుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. జేఈఈ వంటి కీలకమైన పరీక్షలకు ఏకరూప విధానం తీసుకురావాలంటూ విద్యార్ధులు డిమాండ్‌ చేస్తున్నారు. కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) షెడ్యూల్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. సీయూఈటీ ప్రవేశ పరీక్ష మేలో జరుగుతుంది. జేఈఈకి ఫిక్స్‌డ్‌ హెడ్యూల్‌ ఎందుకు ఉండకూడదు? అన్ని ప్రవేశ పరీక్షలకు ఏకరూపత ఉండాలని అంటున్నారు. ఓ వైపు బోర్డు పరీక్షలు, మరోవైపు జేఈఈ పరీక్షల వల్ల విద్యార్ధులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని పలువురు విద్యావేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.